కోటపల్లి : ఇసుక రీచ్‌ల కాంట్రాక్టర్లు నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ హెచ్చరించారు. కోటపల్లి మండలంలోని బోరంపల్లి, కొల్లూర్ ఇసుక క్వారీ లారీలను జాతీయ రహదారి 63 పై అడ్డదిడ్డంగా ఆపుతుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ స్పందించారు. మంచిర్యాల DCP భాస్కర్‌తో కలిసి లారీ పార్కింగ్ ప్రాంతాన్ని సందర్శించారు.
ఇసుక క్వారీ రిచ్ కాంట్రాక్టర్లతో మాట్లాడారు. ఇసుక లారీలను జాతీయ రహదారిపై ఇష్టారాజ్యంగా పార్కింగ్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇసుక కోసం వచ్చిన లారీలను త్వరత్వరగా లోడ్ చేసి పంపిస్తే ఈ ఇబ్బందులు ఉండవని, ఇసుక లోడింగ్ జాప్యం కారణంగా లారీలు రహదారిపై నిలిచిపోతున్నాయని అన్నారు. లోడింగ్‌లో జాప్యం కారణంగా రోడ్డుపైన వాహనాలు నిలిచిపోయినట్లతే ఇసుక కాంట్రాక్టును రద్దు చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు.
అనంతరం కలెక్టర్ కోటపల్లి తహసీల్దార్ కార్యాలయంను, కోటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను తనిఖీ చేసి వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో చెన్నూర్ రూరల్ CI సుధాకర్, తహశీల్దార్ రాఘవేంద్రరావు, ఎంపీడీఓ లక్ష్మయ్య, డిప్యూటీ తహసీల్దార్ నవీన్ కుమార్, వైద్యాధికారి అరుణశ్రీ తదితరులు ఉన్నారు.