Jupally Krishnarao | కొల్లాపూర్, ఫిబ్రవరి 13 : నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం దేవుని తిర్మలాపూర్‌లో జరిగిన అంతరాష్ట్ర కబడ్డీ పోటీలు ఉమ్మడి జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు స్థానిక క్రీడాకారులను, సమీప గ్రామ ప్రజలను అలరించాయి. అంతరాష్ట్ర కబడ్డీ పోటీలతో గ్రామంలో సందడి నెలకొంది. తెలంగాణ రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా కబడ్డీ క్రీడాకారులు దేవుని తిరుమలాపూర్ గ్రామానికి రావడంతో గ్రామంలో క్రీడా సంబరాలు అంబరాన్ని అంటాయి.
రాత్రి అవుతున్నా క్రీడాపోటీలను తిలకించేందుకు వచ్చిన గ్రామస్తులతోపాటు సమీప గ్రామాల ప్రజలతో క్రీడామైదానం కిక్కిరిసిపోయింది. అంతరాష్ట్ర కబడ్డీ పోటీలలో ప్రథమ బహుమతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాకు రాగా, ద్వితీయ బహుమతి కాసాని అకాడమీ హైదరాబాద్ కు వచ్చింది. ఉమ్మడి జిల్లా వాలీబాల్ పోటీలలో ప్రథమ బహుమతి కల్వకోలు జట్టు, ద్వితీయ బహుమతి గంట్రావుపల్లి జట్టుకు వచ్చాయి.
క్రీడాపోటీలో ముగింపు సందర్భంగా బుధవారం రాత్రి రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు , టీపీసీసీ సభ్యులు చింతలపల్లి జగదీశ్వర రావు, పెద్దకొత్తపల్లి మండలం మాజీ ఎంపీపీ సూర్య ప్రతాప్ గౌడ్, అంతరాష్ట్ర క్రీడాకారులను పరిచయం చేసుకోవడంతోపాటు పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు క్రీడాకారులు, క్రీడా అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రతి పౌరుడు శారీరక దృఢంగా మానసికంగా ధైర్యంగా ఉండాలంటే కచ్చితంగా క్రీడలలో పాల్గొనాలని పేర్కొన్నారు. విద్యార్థి దశ నుంచే చదువుతోపాటు క్రీడల పట్ల ఆసక్తి మక్కువ పెరిగితే ఎలాంటి విపత్తులనైనా తట్టుకునే మానసిక ధైర్యం వుంటపడుతుందన్నారు.
అంతరాష్ట్ర కబడ్డీ పోటీలకు, ఉమ్మడి జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలకు సహకారం అందించి క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న మాజీ ఎంపీపీ సూర్య ప్రతాప్ గౌడ్‌ను ఆయన అభినందించారు. మాజీ ఎంపీపీ సూర్య ప్రతాప్ గౌడ్ మాట్లాడుతూ.. వాలీబాల్, కబడ్డీ ఆసక్తిగా ఆడివాడిని. ఆటగాళ్లలో గెలుపోటములు సహజం కాబట్టి క్రీడాకారులందరూ సంతోషంగా ఆడాలని తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి ఎంతో దూరం నుంచి వ్యయప్రయాసలకు నోచుకుని వచ్చినటువంటి క్రీడాకారులందరికీ అభినందనలు తెలియజేశారు. రాత్రి 11 అయినా మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైనల్ మ్యాచ్ టాస్ వేయడంతోపాటు మ్యాచ్ పూర్తయ్యే వరకు వీక్షించారు.
ఈ కార్యక్రమంలో కార్యనిర్వహకులు గుమ్మకొండ రమేష్, వి బాలలింగాచారి, బొల్లె విష్ణు, నైనపల్లి మైసమ్మ చైర్మన్ బి శ్రీనివాస్, జిల్లా గ్రంధాలయ మాజీ చైర్మన్ నాగపూర్ విష్ణు, మాజీ ఎంపీపీ వరదరాజుల వెంకటేశ్వరరావు, పెద్దకొత్తపల్లి మాజీ సింగల్ విండో చైర్మన్ డి బాలస్వామి, కొత్తపేట మాజీ సొసైటీ చైర్మన్ గోపాలరావు, దేవుల్ తిరుమలాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ వి.సత్యం, పెద్దకొత్తపల్లి సింగిల్ విండో వైస్ చైర్మన్ రాజు గ్రామాల మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Aadhaar | ఆధార్ కార్డుల కోసం రోడ్డెక్కిన మహిళ.. నలుగురు పిల్లలతో కలిసి జీహెచ్ఎంసీ ఆఫీస్ ఎదుట ధర్నా
Langar House | లంగర్ హౌస్‌లో ఫుట్ పాత్ ఆక్రమణల కూల్చివేత
Hyderabad | మూసీ పరిసరాల్లో మళ్లీ కూల్చివేతలు.. భయాందోళనలో జనం