P Amarender | నాగర్ కర్నూల్, మార్చి 11: దివ్యాంగ విద్యార్థుల ప్రగతి విద్యా ద్వారానే సాధ్యపడుతుందని అదనపు కలెక్టర్ అమరేందర్ అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సఖి కేంద్ర ఆవరణలో జిల్లా విద్యాశాఖ సమగ్ర శిక్ష అభియాన్, అలింకో సంస్థ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ పి అమరేందర్, జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ దివ్యాంగులకు ఇవాళ ఉచిత సహాయ ఉపకరణాలు పంపిణీ చేశారు.
జిల్లాలో 0-18 ఏళ్లలోపు వివిధ లోపాలతో బాధపడుతున్న వారిని గత సంవత్సరం ఆగస్టు నెలలో పరీక్షలు నిర్వహించి 102 మంది దివ్యాగులకు 12 లక్షల రూపాయల వ్యయంతో 233 పరికరాలు పంపిణీ చేశారు. వీటిలో 78 వినికిడి పరికరాలు, 22 చక్రాల కుర్చీలు, 36 సీపీ కుర్చీలు, 16 రొలేటర్స్ 20 చంక కుర్చీలు, 5 బ్రెయిలీ కిట్స్, 2 సుకన్య కేన్ కిట్స్, 93 ఎంఎస్ఐ ఈడీ కిట్స్, 9 పుట్ ఆర్థోన్లు పంపిణీ చేశారు.
అనంతరం అదనపు కలెక్టర్ అమరేందర్ మాట్లాడుతూ.. దివ్యాంగ చిన్నారులు జీవితంలో ఉన్నత స్థానానికి రావాలంటే కేవలం విద్య ఒక్కటే మార్గ నిర్దేశకం అవుతుందన్నారు. దివ్యాంగులకు మంచి విద్యను అందిస్తే వారి భవిష్యత్ స్వర్గధామంగా మారుతుందని, ఈ విషయాన్ని ప్రతి తల్లిదండ్రులు గ్రహించాలన్నారు. ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంధులైన దివ్యాంగులను ఇటీవల న్యాయమూర్తులుగా ఎంపిక చేసిన విషయాన్ని ఈ సందర్భంగా తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో 3 శాతం రిజర్వేషన్లు ఆయా ప్రభుత్వాలు కల్పించారన్నారు. ఈ అవకాశాలను సద్వినియోగపరచుకొని దివ్యాంగులైన విద్యార్థులను ఉన్నత స్థాయిలో రాణించేందుకు తల్లిదండ్రులతోపాటు ప్రత్యేక అవసరాల ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. దివ్యాంగ విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెంపునకు సమగ్ర శిక్ష అభియాన్ అందించిన ఉచిత ఉపకరణాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు.
చదువే సరైన ఆయుధం..
దివ్యాంగ విద్యార్థులు ఉన్నత స్థానంలోకి రావడానికి కేవలం చదువుకుంటే సరైన ఆయుధమన్నారు. దివ్యాంగులకు ప్రభుత్వ యంత్రాంగం ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. దివ్యాంగుల్లో ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుందన్నారు. వారు అనుకుంటే ఏదైనా సాధిస్తారని చెప్పారు.దివ్యాంగులకు జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడు ఉంటుందని చెప్పారు. ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే వాటిని సంబంధిత శాఖలతో చర్చించి పరిష్కరిస్తానని చెప్పారు.
ఈ సందర్భంగా డీఈఓ రమేష్ కుమార్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఉన్న 20 మండలాల పరిధిలో 3180 మంది వివిధ రకాల వైకల్యాలు కలిగిన దివ్యాంగ చిన్నారులను గుర్తించడం జరిగిందని తెలిపారు. వారందరికీ విద్యతోపాటు అవసరమైన వైద్య సదుపాయాలను కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతి భవిత కేంద్రంలో ప్రత్యేక అవసరాలు కలిగిన ఉపాధ్యాయులతో విద్య అందించడంతోపాటు, ప్రతి శనివారం దివ్యాంగ విద్యార్థుల ఇంటి దగ్గరే ఫిజియోథెరపీ కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేస్తున్నామని తెలిపారు.
జిల్లా కలెక్టర్ గారి ఆమోదంతో 12 లక్షల రూపాయల వ్యయంతో 102 మంది దివ్యాంగ చిన్నారులకు 233 వివిధ రకాల ఉపకరణాలను అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన జిల్లా సమగ్ర శిక్ష అభియాన్ కోఆర్డినేటర్ బరపటి వెంకటయ్యను డిఈఓ సందర్భంగా అభినందించారు. అంతకుముందు కోఆర్డినేటర్ బరపటి వెంకటయ్య మాట్లాడుతూ జిల్లా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకు చేపట్టిన కార్యక్రమాల వివరాలను అందించే పరికరాలు, నిర్వహించే సేవలను ఆయన వివరించార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ ను డిఇఓ శాలువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష కోఆర్డినేటర్ బరపటి వెంకటయ్య, సఖి కోఆర్డినేటర్ సునీత, ప్రత్యేక అవసరాలు ఉపాధ్యాయులు ప్రకాష్, రాఘవేందర్, శ్యామ్, శ్రీలత, రేనమ్మ, వసంత విజయలక్ష్మి, విజయ, జయప్రకాష్, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.
Read Also :
KTR | ఎట్లుండె తెలంగాణ.. ఎట్లాయె తెలంగాణ..! కేటీఆర్ ఆవేదన
Bomb Attack | పాఠశాలపై బాంబులతో దాడి.. షాకింగ్ వీడియో
Chhaava Movie | నాలుగు రోజుల్లో రూ.10 కోట్లు.. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ‘ఛావా’ విధ్వంసం