MLA Rajesh reddy | అధిక సాంద్రత పద్ధతిలో పత్తి పంటను సాగు చేస్తే తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించవచ్చని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అన్నారు. ఇవాళ నాగర్ కర్నూల్ జిల్లాలోని బిజీనేపల్లి మండలం పాలెం వ్యవసాయ పరిశోధన కేంద్రంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో పాల్గొన్న రైతుల కోసం శాస్త్రవేత్తల సమక్షంలో కిసాన్ మేళా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాసంగి వేరుశనగ, వరి, మొక్కజొన్న, మినుము పంటలపై అవగాహన కార్యక్రమాలు, వివిధ వ్యవసాయ అంశాలపై నమూనాల ప్రదర్శనలు, ఆధునిక వ్యవసాయ యంత్రాల డెమో ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. అదనంగా అధిక సాంద్రత పత్తి సాగుపై రైతులు, శాస్త్రవేత్తలతో వివరణాత్మక చర్చ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయం అన్నారు.
ఈ అవగాహన కార్యక్రమాన్ని తప్పనిసరిగా వినియోగించుకోవాలని రైతులకు సూచిస్తూ.. వివిధ కంపెనీల స్టాల్స్‌ను సందర్శించారు. ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ఇలాంటి కిసాన్ మేళా కార్యక్రమాలు రైతులకు ఆధునిక సాంకేతికత పరిచయం కల్పించి, వ్యవసాయ రంగంలో నూతన మార్పులు తీసుకురావటానికి ఎంతో ఉపయోగపడుతాయని తెలిపారు.
కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ ప్రభాకర్ రెడ్డి, శాస్త్రవేత్తలు, పలు రకాల విత్తన కంపెనీల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని, రైతులకు మార్గనిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఏడీఆర్ సుధాకర్, కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ ప్రభాకర్ రెడ్డి, శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు, రైతులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు.
Nagarkurnool | చేతకాకపోతే గద్దె దిగండి.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ పాడి రైతులు
Air India | అజర్బైజాన్ గగనతలంలో ప్రయాణిస్తున్న విమానానికి బెదిరింపులు.. ముంబైకి దారి మళ్లింపు
Donthi Madhav Reddy | అర్హులైన వారందరికి ఇందిరమ్మ ఇండ్లు : దొంతి మాధవరెడ్డి