అచ్చంపేట, ఏప్రిల్ 2: దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో సజీవ సమాధి అయినా మిగిలిన ఆరుగురు కార్మికుల ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. టన్నెల్లో జరుగుతున్న సహాయక చర్యల పురోగతిని తెలుసుకునేందుకు బుధవారం రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం సందర్శించనున్నారు.
జరుగుతున్న సహాయక చర్యలను పరిశీలించిన అనంతరం సహాయక చర్యలపై రెస్క్యూ ఆపరేషన్ ఉన్నతాధికారులు, ఇతర ప్రత్యేక అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి చర్చించనున్నారు. మంత్రి ఉదయం శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి దర్శనం కోసం వెళ్లారు. అక్కడ దర్శనం అనంతరం హైదరాబాద్ తిరుగు ప్రయాణంలో ఎస్ఎల్బీసీని టన్నెల్ ప్రమాద ప్రాంతానికి సందర్శించనున్నట్లు అధికారులు తెలిపారు.