Farmers | తిండి తిప్పలు లేకుండా పడిగాపులు.. మండుటెండలో మక్కజొన్న రైతుల ఆందోళన వీడియో
Farmers | ఆరుగాలం పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులకు తిప్పలు తప్పడం లేదు. కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి కండ్లు కాయలు చేసేలా ఎదురుచూసినా అధికార యంత్రాంగం, ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోవడం లేదు. వడ్లు, మక్కలు కొనుగోలు చేయాలంటే మండుటెండలో రోడ్లెక్కి ఆందోళన చేసినా కనికరించడం లేదు. నాగర్కర్నూల్ జిల్లాలో మొక్కజొన్న రైతులు తాడూరు మండలంలో ఇంద్రకల్ రోడ్డుపై ఆందోళనకు దిగారు. ఇంద్రకల్ గ్రామంలో మొక్కజొన్న సేకరణ గోదాముల వద్ద పది రోజులుగా మొక్కజొన్న ట్రాక్టర్లతో నిరీక్షిస్తున్న రైతులు అధికారుల నిర్లక్ష్య వైఖరితో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.
Farmers | ఆరుగాలం పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులకు తిప్పలు తప్పడం లేదు. కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి కండ్లు కాయలు చేసేలా ఎదురుచూసినా అధికార యంత్రాంగం, ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోవడం లేదు. వడ్లు, మక్కలు కొనుగోలు చేయాలంటే మండుటెండలో రోడ్లెక్కి ఆందోళన చేసినా కనికరించడం లేదు.
నాగర్కర్నూల్ జిల్లాలో మొక్కజొన్న రైతులు తాడూరు మండలంలో ఇంద్రకల్ రోడ్డుపై ఆందోళనకు దిగారు. ఇంద్రకల్ గ్రామంలో మొక్కజొన్న సేకరణ గోదాముల వద్ద పది రోజులుగా మొక్కజొన్న ట్రాక్టర్లతో నిరీక్షిస్తున్న రైతులు అధికారుల నిర్లక్ష్య వైఖరితో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.
రైతుల ఆందోళనతో రోడ్డుకు ఇరువైపులా మొక్కజొన్న ట్రాక్టర్లు, లారీలు భారీగా కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ఒక గోదాం నిండిందని మరొక గోదాంకు పంపించారని, ఆ గోదాంలో కూడా నిండుతుందని.. మా పరిస్థితి ఏంటని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. తాము రోజుల తరబడి తిండి తిప్పలు లేకుండా పడిగాపులు కాస్తున్నామని.. కొనుగోళ్లు వెంటనే పూర్తిచేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో ఆందోళనకు దిగిన మొక్కజొన్న రైతులు
రోడ్డుపై బైఠాయించి ఆందోళన
తాడూరు మండలంలో ఇంద్రకల్ రోడ్డు మొక్కజొన్న సేకరణ గోదాముల వద్ద పది రోజులుగా మొక్కజొన్న ట్రాక్టర్లతో రైతుల నిరీక్షణ
రోడ్డుకు ఇరువైపులా భారీగా కిలోమీటర్ల మేర నిలిచిపోయిన మొక్కజొన్న ట్రాక్టర్లు,… pic.twitter.com/l9fRxOiucF
— Telugu Scribe (@TeluguScribe) May 25, 2026
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 17-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్లో అన్నీ స్కామ్లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

