వెల్దండ ఏప్రిల్ 25: గ్రామీణ ప్రాంతాల్లో మరుగున పడుతున్న వీధినాటకలను ప్రోత్సహిద్దామని బీఆర్ఎస్ మండల నాయకులు అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పోతేపల్లి గ్రామంలో శ్రీరేణుక ఎల్లమ్మ కళా బృందం మునిరంగ స్వామి స్టేజి నాటకం కోసం వెల్దండ మండల బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు తగుళ్ల కొండల్ యాదవ్ తన వంతుగా విరాళం అందించేందుకు ముందుకు వచ్చారు. సంస్కృతి, సంప్రదాయాలు, కళాపోషణ అంతరించిపోకుండా ఉండేందుకు తన వంతుగా రూ.10,116 వేలు విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కండేయుడు, చిన్న సైదయ్య, గోపాలు, వెంకటయ్య, కళాకారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Pushpa 2 | అద్భుతం చేయలేకపోయిన పుష్ప2.. తేడా ఎక్కడ జరిగింది..!
BSF Jawan | పాక్ అదుపులో భారత జవాన్.. పొరపాటున ఆ దేశ భూభాగంలోకి ప్రవేశించిన పీకే సింగ్