BSF Jawan | న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: భారత సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) జవాన్ ఒకరిని పాకిస్థాన్ రేంజర్స్ తమ అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ సెక్టార్లో బుధవారం మధ్యాహ్నం అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ)ని పొరపాటున దాటిన పీకే సింగ్ అనే కానిస్టేబుల్‌ను వారు అదుపులోకి తీసుకున్నారు.
182 బీఎస్ఎఫ్ బెటాలియన్‌కు చెందిన సింగ్ పశ్చిమ బెంగాల్ వాసి. ఫిరోజ్పూర్లో ఇండో-పాక్ సరిహద్దు వద్ద ఆయన కొంతమంది రైతులతో కలిసి అనుకోకుండా భారత సరిహద్దును దాటి పాక్ ప్రాంతంలోకి అడుగుపెట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా, సైనికుడిని విడిపించడానికి భారత ఆర్మీ అధికారులు పాకిస్థాన్ రేంజర్లతో ఫ్లాగ్ మీటింగ్ జరిపారు.
ఇలాంటి సంఘటలు అసాధారణం కాదని, గతంలో కూడా ఇలాంటివి జరిగా యని అధికారులు పేర్కొన్నారు. పౌరు లు కానీ, జవాన్లు కానీ ఇలా అనుకోకుండా ఆవలి దేశ సరిహద్దులోకి వెళ్లిన సందర్భాల్లో ఇరుదేశాల అధికారులు మిలిటరీ ప్రొటోకాల్ ప్రకారం ఫ్లాగ్ మీటింగ్‌ల ద్వారా సమస్యను పరిష్కరించుకుంటారు.
అయితే పహల్గాం ఉదంతం తర్వాత పాకిస్థాన్‌పై భారత్ ఆంక్షలు విధించిన క్రమ ంలో ఈ పరిణామం ఎక్కడికి దారితీస్తుందోనన్న ఆందోళన వ్యక్తం అవుతున్నది.పాక్ రేంజర్లకు పట్టు బడిన సమయంలో సాహు యూనిఫాంలో ఉన్నారని, అతని వద్ద సర్వీస్ రైఫిల్ కూడా ఉన్నట్టు అధికారులు చెప్పారు. పహల్గాం ఘటనకు దీనిని పాక్ ముడి పెడుతుందా అని భారత్ సందేహ పడుతున్నది.