హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అంగన్వాడీకేంద్రాల పర్యవేక్షణ బాధ్యతలు ప్రభుత్వం సర్పంచ్‌లకు అప్పగించింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. సర్పంచ్ చైర్మన్‌గా 11 మందితో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ కమిటీలో అంగన్వాడీ టీచర్ కన్వీనర్‌గా, ఏఎన్ఎం, పాఠశాల సైన్స్ టీచర్, రిటైర్డ్ ఉద్యోగి, ఆరుగురు చిన్నారుల తల్లులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ గర్భిణులు, తల్లులు, బాలింతలకు ప్రతీనెలా బియ్యం, పప్పు, బాలామృతం పంపిణీని పర్యవేక్షించనున్నది. అలాగే ఆరోగ్యలక్ష్మి ద్వారా లబ్ధిదారులకు అందుతున్న భోజనాన్ని పరిశీలిస్తుంది. అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ నాయకులు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.