Pushpa 2 | అద్భుతం చేయలేకపోయిన పుష్ప2.. తేడా ఎక్కడ జరిగింది..!
Pushpa 2 | పుష్ప చిత్రంతో ఐకాన్ స్టార్‌గా మారిన అల్లు అర్జున్ ఆ తర్వాత పుష్ప 2తో గ్లోబల్ స్టార్‌గా మారాడు. పుష్ప2 చిత్రం అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో తెరకెక్కి సంచలనం క్రియేట్ చేసింది.
Pushpa 2 | పుష్ప చిత్రంతో ఐకాన్ స్టార్‌గా మారిన అల్లు అర్జున్ ఆ తర్వాత పుష్ప 2తో గ్లోబల్ స్టార్‌గా మారాడు. పుష్ప2 చిత్రం అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో తెరకెక్కి సంచలనం క్రియేట్ చేసింది. భారీ అంచనాలతో డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా తొలి రోజు రూ. 294 కోట్ల ఓపెనింగ్స్ అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర రూ. 1850 కోట్లను వసూలు చేసి నయా రికార్డులను క్రియేట్ చేసింది. ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం శాటిలైట్ ఛానల్ లో ప్రీమియర్ అవుతున్నప్పుడు భారీ రేటింగ్స్ వస్తాయని అందరు అనుకున్నారు. ఇక టీమ్ కూడా విస్తృతంగా ప్రమోషన్స్ చేసింది. సుకుమార్, దేవిశ్రీప్రసాద్ తదితరుల ప్రత్యేక ఇంటర్వ్యూ ఫుటేజ్ తీసుకుని ప్రసారం మధ్యలో వాటిని వదిలారు.
అయితే ఎన్ని చేసిన కూడా పుష్ప2 చిత్రం ప్రభంజనం సృష్టించలేకపోయింది. ఊహించిన దాని కన్నా కొంచెం ఆటు ఇటు రీచ్ అయ్యి అభిమానులకు, టీవీ వర్గాలకు పుష్ప2 ఊహించని షాక్ ఇచ్చింది. రిపోర్ట్స్ ప్రకారం పుష్ప 2 ది రూల్ కు వచ్చిన టిఆర్పి 12.61 మాత్రమే. ఇది మంచి నెంబరే అయిన బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన ఫలితంతో పోలిస్తే చాలా తక్కువే. గతంలో బన్నీ నటించిన అల వైకుంఠపురములో (29.4), పుష్ప ది రైజ్ (22.5), డీజే దువ్వాడ జగన్నాథం (21.7) బన్నీ చిత్రాల్లో అగ్ర స్థానంలో ఉండగా సూపర్ ఫ్లాప్ గా నిలిచిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా (12.5) కి దగ్గరగా పుష్ప 2 నెంబర్ నమోదు కావడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తుంది.
అయితే పుష్ప2 ప్రీమియర్ సమయంలో సంక్రాంతికి వస్తున్నాం రెండోసారి జీ ఛానల్ లో రావడం కొంత ఎఫెక్ట్ చూపించింది. మరోవైపు ఓటిటిలు వచ్చాక మునుపటిలా కొత్త సినిమాలు టీవీలో అదే పనిగా చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపడం లేదు. మరోవైపు సినిమా రిలీజ్ అయిన రోజే పైరసీ ప్రింట్ బయటకి వచ్చేస్తుంది. అక్కడే అందరు చూస్తున్నారు. అందుకే టీఆర్పీ తగ్గుతుంది. ఇలా అయితే భవిష్యత్తులో శాటిలైట్ హక్కుల డిమాండ్ మరింత కిందకు పడిపోయే అవకాశం లేకపోలేదు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Allu arjun
- pushpa2
- sukumar
- trp
RELATED ARTICLES
తాజా వార్తలు
హై ఓ థ్రిల్లింగ్ రైడ్
మూడేండ్లు ఫుల్ బిజీ
Health tips | మంచినీళ్లు తక్కువ తాగితేనే కాదు.. మరీ ఎక్కువ తాగినా ఆరోగ్యానికి హానికరమే..!
Nepal PM Balen Shah | భారత్ చేరుకున్న నేపాల్ ప్రధాని.. సోమవారం ప్రధాని మోదీతో చర్చలు
Festivals | పండుగల సమయంలో స్వీట్లను ఎక్కువగా తింటే షుగర్ లెవల్స్ ఎప్పటికీ అలాగే ఉంటాయా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

