హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్హెచ్ఎం) ఉద్యోగులకు జీవో నంబర్ 60 ప్రకారం రూ.15వేల జీతాన్ని పెంచి వెంటనే విడుదల చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర ఉప కార్యదర్శి ఎం నరసింహ, కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేశ్‌ఖన్నా డిమాండ్ చేశారు. సోమవారం సంఘాల ఆధ్వర్యంలో కోఠిలోని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కా ర్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం తమ సమస్యలు పరిష్కరించాలని కమిషనర్‌కు వినతిపత్రం అందించగా, సానుకూలంగా స్పందించారని వెల్లడించారు.
నర్సులకు కనీస వేతనం చెల్లించాలి: సూర్యకుమార్
హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ) : సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రైవేట్ నర్సులకు రూ.20వేల కనీస వేతనం చెల్లించాలని తెలంగాణ ఫ్లోరెన్స్ నర్సింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నక్క సూర్యకుమార్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ప్రైవేట్ దవాఖానల్లో సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, రోజువారీ డ్యూటీ గంటలను పరిమితం చేయాలని కోరారు. రాష్ట్రంలో నర్సులకు జరుగుతున్న ఆర్థిక దోపిడీని వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు.