Beeram harshavardhan reddy | కొల్లాపూర్, జనవరి 3 : కొల్లాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే మున్సిపల్ ఎన్నికలలో బీఆర్ఎస్ గెలవాలని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీరం హర్షవర్ధన్ రెడ్డి శనివారం కొల్లాపూర్ పట్టణంలోమున్సిపాలిటీలోని 19 వార్డుల ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.
కొల్లాపూర్ అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ గెలవాలన్నారు. కార్యకర్తల జోలికి వస్తే మీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని కాంగ్రెస్ నేతలను హెచ్చరించారు. ఈ సందర్భంగా కొల్లాపూర్ మున్సిపల్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన దొంగ హామీలకు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించారన్నారు. నియోజకవర్గం అన్ని రంగాలలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాత్రమే అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు.
పార్కును గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం..
రాజకీయాలకతీతంగా పనిచేశామని ఇప్పుడు రాజకీయ కక్ష సాధింపు చర్యలతో పని చేస్తున్నారన్నారు. కొల్లాపూర్ మున్సిపల్ లో సుదీర్ఘకాలంగా ఉన్న అనేక సమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు. కొల్లాపూర్ పట్టణంలో తమ హయాంలో పార్క్ నిర్మాణం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పార్కును గాలికి వదిలేసిందన్నారు. కొల్లాపూర్ పట్టణానికి ఆర్టికల్చర్ కళాశాల ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాన్సల్ చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు గడిచిన కొల్లాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధి చేయలేదని కొల్లాపూర్ మున్సిపాలిటీలో డ్రైనేజీ తాగునీటి సమస్య కరెంటు సమస్య తీవ్రతరమైందన్నారు.
అబద్ధపు ప్రచారాలతో కొల్లాపూర్ అభివృద్ధిని గాలికి వదిలేసారని విమర్శించారు. కొల్లాపూర్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అధికార పార్టీ నాయకులు ఒకే ఇంట్లో 30 దొంగ ఓట్లను నమోదు చేసుకున్నారని ఆయన ఆరోపణలు చేశారు. మున్సిపాలిటీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని ఆయన పేర్కొన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు రెండు సంవత్సరాలు కొల్లాపూర్ అభివృద్ధికి ఏం చేశారని ప్రశ్నించారు. కొల్లాపూర్ పట్టణ కేంద్రం లో మెయిన్ రోడ్ డివైడర్ ను మరియు ప్రస్తుత 17 వార్డ్ లో పార్క్ నిర్మాణం చుక్కాయిపల్లి వంతెన నిర్మాణం ఈదమ్మ తల్లి గుడి నిర్మాణం చెప్పుకుంటూ పోతే చాలా అభివృద్ధి పనులు పూర్తి చేశామన్నారు.
త్రాగునీరు, కరెంట్ కూడా సరిగ్గా అందించడం లేదు..
5 యేండ్లలో 2 ఏండ్లు కరోనా తో ఇబ్బంది పడిన 3 ఏండ్లలో ఇంత అభివృద్ధి చేశామని అధికారంలో ఉన్న నాయకులు ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నా చేసిన అభివృద్ది శూన్యం అన్నారు. ముస్లిం సోదరులకు ఖాదర్ భాషా దర్గా రోడ్ నిర్మాణం దర్గా వద్ద సొంత ఖర్చులతో షెడ్డు నిర్మాణం, ఈద్గా నిర్మాణం చేశారన్నారు. కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో త్రాగునీరు, కరెంట్ కూడా సరిగ్గా అందించడం లేదన్నారు. ఎన్నికల సమయంలో టెంకాయలు కొట్టే వారికి ప్రజలు బుద్ది చెప్పాలని.. ఇన్ని ఏండ్లలో పట్టణ అభివృద్ది ఏమి చేశారని ప్రజలకు వివరించాలన్నారు.
కొల్లాపూర్‌ను అభివృద్ధి చేయకుండా బీఆర్ఎస్ నాయకులపై, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతూ బెదిరిస్తున్నారన్నారు. అక్రమ కేసులకు భయపడేది లేదని తప్పకుండా న్యాయ పోరాటం చేస్తామని మా కార్యకర్తల జోలికి వస్తే మీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు కూడా వెనకాడబోమని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో కొల్లాపూర్ మున్సిపల్ బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Jogu Ramanna | రైతు సమస్యలపై మాజీ మంత్రి ఆధ్వర్యంలో ఆందోళన
Khammam Rural : 32 వార్డులు 45 వేల మంది ఓటర్లు.. ఈఎంసి ఓటరు డ్రాఫ్ట్ జాబితా విడుదల
Bonakal : అంగన్వాడీ పిల్లలకు యూనిఫాం పంపిణీ