వెల్దండ ఏప్రిల్ 24: ఈనెల 27న వరంగల్ జిల్లాలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని బీఆర్ఎస్ మండల యువ నాయకుడు గోకమల్ల రాజు కోరారు. శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం రాచూర్ గ్రామంలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ పోస్టర్లను విడుదల చేసి, పోస్టర్లను గోడలకు అతికించారు. పార్టీ జెండా కోసం దిమ్మె నిర్మాణం చేపట్టారు.
ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ.. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సూచన మేరకు అన్ని గ్రామాల్లోకి పోస్టర్లను అతికించినట్లు తెలిపారు.
కేటీఆర్ పిలుపుమేరకు పార్టీ దిమ్మెల నిర్మాణం చేసి బీఆర్ఎస్ జెండాలు ఆవిష్కరించామన్నారు. రజతోత్సవ సభకు దండులా కదిలి విజయవంతం చేయాలన్నారు. ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ పాలనను కోరుకుం టున్నారని తెలిపారు. చరిత్రలో నిలిచేలా వరంగల్ సభ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పర్వతాలు, మాజీ ఎంపిటిసి గుత్తి వెంకటయ్య, తదితరులు ఉన్నారు.