Kalyana lakshmi cheques | కొల్లాపూర్, జనవరి 28 : నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో వివిధ గ్రామాలకు వచ్చినటువంటి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తారా…? ఇవ్వరా..? అని సింగోటం గ్రామ ఉపసర్పంచ్ తమటం సాయి కృష్ణ గౌడ్ స్థానిక ఎమ్మెల్యేతోపాటు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
బుధవారం సాయి కృష్ణ గౌడ్ స్థానిక నాయకులతో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కొల్లాపూర్ నియోజకవర్గంలో దాదాపుగా రెండు నెలల సమయం కావస్తున్నా ఇంకా కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయకపోవడం ఎంత దౌర్భాగ్యమని మండిపడ్డారు. పెళ్లి అయిన ఆడపడుచులకు పిల్లలు పుట్టిన తర్వాత కల్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తారా..? అని ప్రశ్నించారు.
వచ్చిన కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయకపోవడం ఎవరి నిర్లక్ష్యం.. స్థానిక మంత్రిదా..? సంబంధిత అధికారులదా…? చెప్పాలని డిమాండ్ చేశారు. ఆడపడచులకు లక్ష రూపాయలతోపాటు తులం బంగారం ఇస్తామన్నారు. తులం బంగారం ఎక్కడ పోయిందో ఏమో కానీ.. వచ్చిన చెక్కులు కూడా ఎందువలన ఇవ్వడం లేదో సమాధానం చెప్పాలన్నారు. వచ్చిన చెక్కులు వెంటనే లబ్ధిదారులకు ఇవ్వకుంటే అన్ని పార్టీలను కలుపుకుని ధర్నా చేస్తామన్నారు.
Mini Medaram | జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మినీ మేడారం జాతర ప్రారంభం
Guava Vs Avocado | జామకాయలు.. అవకాడో.. మన ఆరోగ్యానికి అసలు ఏవి మేలు చేస్తాయి..?