Marri Janardhan Reddy | రైతులు రోడ్డెక్కితే పాలకులు ఎక్కడ దాక్కున్నారు..? అని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నాగర్ కర్నూల్ వ్యవసాయ మార్కెట్లో రాత్రి కురిసిన అకాల వర్షానికి తడిసిన మొక్కజొన్న ధాన్యంను పరిశీలించారు. ఈ సందర్భంగా మర్రి జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. కడుపు మండి రైతులు రోడ్డెక్కితే పోలీసులను పెట్టి బెదిరిస్తారా..? రైతు కడుపు మంట కనిపించడంలేదా ప్రభుత్వానికి..? అని ప్రశ్నించారు. తడిసిన మొక్కజొన్న… ఇది ప్రకృతి వైపరీత్యం కాదు, ప్రభుత్వ వైఫల్యం.. సీఎం స్పందించాలన్నారు.
రైతు నష్టానికి బాధ్యత ఎవరిది..? ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎక్కడ..? రైతు కష్టాల్లో కనిపించడంలేదే ఎందుకు..? సమయం అంతా చిన్నచిన్న ఫంక్షన్ లకేనా..? రైతుల గురించి ఆలోచన లేదా..? గన్ని బ్యాగులు లేవు.. వాహనాలు లేవు.. ఇదేనా మీ పాలన..? కొనుగోలు కేంద్రాలు కాకుండా బాధల కేంద్రాలయ్యాయి.. క్యూలైన్లలో రైతుల ప్రాణాలు పోతున్నాయి… ఎవరు బాధ్యులు..? అని అడిగారు.
నెలరోజులుగా అమ్మకానికి రైతుల అష్టకష్టాలుపడుతున్నారు. ఎండలోనూ… వర్షంలోనూ రైతులే బాధలు భరిస్తున్నారు. ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లే ఈ నష్టంవాటిల్లిందని.. అకాల వర్షాలు వస్తాయని ప్రభుత్వానికి పాలకులకు తెలియదా..? తడిసిన ప్రతి గింజను మద్దతు ధరకు కొనాల్సిందేనని.. ఒక్క గింజ నష్టం జరిగినా బాధ్యత ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు.ఇది ప్రభుత్వం కాదు… రైతులపై శిక్ష విధించే వ్యవస్థ. ప్రజాపాలన కాదు… క్యూలైన్ పాలన. యూరియా నుంచి గన్ని బ్యాగుల వరకు అన్నింటికీ క్యూ లైన్లే,
..కనీస సదుపాయాలు లేక రైతులు నరకయాతనపడుతున్నారు. అన్నదాతను అవమానిస్తే మీ కుర్చీలు కూలిపోతాయి. రైతు చెమటతో ఆటలాడితే చూస్తూ ఊరుకోం. రైతు కోసం పోరాటం మొదలైంది…ఇది ఆగదు. ఇది హెచ్చరిక కాదు చివరి అల్టిమేటం. ఇప్పటికైనా కొనకపోతే రోడ్ల మీదే సమాధానం చెబుతాం.. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం తప్పదు..తడిసిన ధాన్యం వెంటనే కొనాలని.. లేకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు.
నాగర్ కర్నూల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో అకాల వర్షానికి తడిసి ముద్దయిన మొక్కజొన్న పంట చూపిస్తు బోరున విలపిస్తున్న రైతులను ఓదార్చడం జరిగింది @BRSparty @KCRBRSPresident @KTRBRS @BRSHarish pic.twitter.com/D6aHoWJd6A
— Marri Janardhan Reddy (@brsmjr) April 29, 2026
ఆశకు ఓటు వేసి ఆగం అవుతున్నాం సార్ అంటూ బోరున విలపిస్తున్న రైతులు
నాగర్ కర్నూల్ మార్కెట్ యార్డులో రైతుల ఆవేదన @BRSparty @KTRBRS @BRSHarish pic.twitter.com/uJItDYz5yJ
— Marri Janardhan Reddy (@brsmjr) April 29, 2026