Beeram Harshavardhan Reddy : ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డి (Beeram Harshavardhan Reddy) ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయలేకనే డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరతీసిందని ఆయన మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమ నాయకుడిగా కాంగ్రెస్ మెడలు వంచి.. ఆపై ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథాన నడిపిన కేసీఆర్‌కు నోటుసులివ్వడం రాజకీయ కక్షలో భాగమని ఆయన అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని, కార్యకర్తలను వేధించడమే లక్ష్యంగా ప్రస్తుతం రాష్ట్రంలోని పోలీస్ యంత్రాంగం పనిచేస్తోందని బీరం హర్షవర్థన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కక్ష సాధింపు చర్యలకు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం భయపడతారనుకుంటే అది పూర్తిగా పొరపాటు.
తెలంగాణను అన్ని విధాల అభివృద్ధి చేసి, రోడ్లు, భవనాలు నిర్మించి దేశంలోనే అగ్రస్థానంలో నిలిపినటువంటి కేసిఆర్‌ను ఇలా వేధించడం చాలా దురదృష్టకరం. గులాబీ బాస్‌కు సిట్ నోటీసులను యావత్ తెలంగాణ ప్రజలు తీవ్రంగా ఖండించాలి అని బీరం హర్షవర్థన్ రెడ్డి పేర్కొన్నారు.