Donation | వెల్దండ మార్చి 10 : నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల పరిధిలోని రాచూర్ గ్రామంలో వెలసిన శ్రీ ఆంజనేయ స్వామి, శివాలయాలకు రంగులు వేయడానికి సోమవారం కాంగ్రెస్ యువ నేత మూడవత్ హరి కిషన్ నాయక్ రూ.లక్ష రూపాయలు విరాళం ప్రకటించారు.
ఈ సందర్భంగా సోమవారం గ్రామస్తుల సమక్షంలో ఆలయ నిర్వహకులకు చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా హరికిషన్ నాయక్ మాట్లాడుతూ.. భవిష్యత్‌లో కూడా ఆలయ అభివృద్ధి కోసం తన వంతుగా తోడ్పాటు అందిస్తానని అన్నారు. అనంతరం హరి కిషన్ నాయక్‌ను ఆలయ నిర్వాహకులు గ్రామస్తులు అభినందించారు.
ఈ కార్యక్రమంలో రౌతు బాల కిష్టయ్య గౌడ్, యాదయ్య, పర్వతాలు, వడ్ల యాదయ్య, గూళ్ళ జంగయ్య, కొంగల్ల జంగయ్య, రౌతు రాజన్న గౌడ్, దుబ్బ వెంకటయ్య, మల్లేష్ ముదిరాజ్, రమేష్ ముది రాజ్ పడకంటి వెంకటేష్, చంద్ర శేఖర్, సురేష్ రెడ్డి, శివశంకర్, వంశీకృష్ణ, శ్రీశైలం, సుభాష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Nagarkurnool | చేతకాకపోతే గద్దె దిగండి.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ పాడి రైతులు
Air India | అజర్బైజాన్ గగనతలంలో ప్రయాణిస్తున్న విమానానికి బెదిరింపులు.. ముంబైకి దారి మళ్లింపు
Donthi Madhav Reddy | అర్హులైన వారందరికి ఇందిరమ్మ ఇండ్లు : దొంతి మాధవరెడ్డి