నాగర్‌కర్నూల్, జూలై 21 : కాంగ్రెస్ పార్టీ నాయకుడి దాడిలో తీవ్రంగా గాయపడి నాగర్ కర్నూల్ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ పార్టీ నాయకుడు రవీందర్‌రెడ్డిని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సోమవారం పరామర్శించారు. నాగర్ కర్నూల్ మండలంలోని నల్లవెల్లి గ్రామానికి రవీందర్ రెడ్డిపై రెండు రోజుల క్రితం అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు.