Social Media | వెల్దండ, జులై 2 : సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని సైబర్ క్రైమ్ బ్రాంచ్ కర్నూల్ డీఎస్పీ గిర్ కుమార్ కల్కోట అన్నారు. బుధవారం వెల్దండ మండలం గుండాల గ్రామంలో గల తెలంగాణ ఏకలవ్య గురుకుల మోడల్ పాఠశాలలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఎస్పీ గిర్ కుమార్ కల్కోట ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు కొన్ని సూచనలు తెలియజేశారు. వ్యక్తిగత వివరాలు, బ్యాంకింగ్ వివరాలు ఇతరులతో పంచుకోరాదని, సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులతో స్నేహం చేయరాదన్నారు. చక్కగా చదువుకొని సమాజం పట్ల బాధ్యతగా ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ కోడం భాస్కర్, ఏఎస్ఐ జక్విల్లా, కానిస్టేబుళ్లు శ్రీను, కృష్ణ, మహేష్ విద్యార్థులు పాల్గొన్నారు.
SIGACHI | మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం.. సిగాచీ పరిశ్రమ ప్రకటన
Phoenix Movie | ఈ సినిమాకు ముందు 120 కిలోలున్నా : విజయ్ సేతుపతి కుమారుడు సూర్య