బిజినేపల్లి,ఏప్రిల్ 10 : కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు అశోక్ డిమాండ్ చేశారు. గురువారం బిజినపల్లి మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాల నుంచి దిగుమతి చేసుకునే క్రూడ్ ఆయిల్ చమురు ధరలు తగ్గినా కేంద్ర ప్రభుత్వం రేట్లు పెంచడం దుర్మార్గమన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఈ దేశంలో అనుసరిస్తుందని విమర్శించారు.పెంచిన ధరలు వెంటనే తగ్గించాలని లేదంటే రాబోయే కాలంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల నాయకులు చంద్రశేఖర్, మల్లేష్, శివ మల్లేష్, తదితరులు ఉన్నారు.