అమరచింత, మే 05 : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో అమరచింత పట్టణంలో అక్రమాలు జరిగాయని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చిన్న బాల్ రాజు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ లెనిన్, బీఆర్ఎస్ నాయకులు అబ్రహం ఆరోపించారు. మున్సిపల్ పరిధిలో ఇప్పటివరకు జరిగిన ఇండ్ల కేటాయింపులో ఒకరిద్దరికి అర్హులైన వారికి ఇచ్చి మిగతా లబ్ధిదారులందరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారిని ఆరోపించారు. అలాగే పట్టణంలో ప్రత్యేక అధికారుల పాలనలో ప్రజా సమస్యలు ఎక్కడికక్కడ తిష్టవేశాయన్నారు.
వార్డుల్లో డ్రైనేజీల నుండి మురుగునీరు రోడ్డుపై ప్రవహిస్తుందని, అలాగే పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను చేపట్టేందుకు చొరవ తీసుకోవాలన్నారు. ముఖ్యంగా ఎన్నో రోజులుగా పేద ప్రజలు ఆశగా ఎదురు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించి అర్హులైన వారిని గుర్తించి అవకతవలకు చోటు లేకుండా చూడాలని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కోరి శ్రీనివాసులు, పెద్ద బాలరాజ్, దేవరాజ్, షంషీర్, మెత్తు, మొండి విజయ్, డి శేఖర్, క్రాంతి, కే జాన్సన్ తదితరులు ఉన్నారు.