మూసాపేట, ఏప్రిల్ 27 : మండలంలోని గ్రామాలలో ఆదివారం గులాబీ జెండా రెపరెపలాడింది. బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ వసంతంలోకి అడుగుపెడుతున్నది.ఈ సందర్భంగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో రజతోత్సవ మహాసభ ఆదివారం జరుగున్నది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు మాజీ ఎమ్మెల్యే ఆల వేంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో రజతోత్సవ మహాసభకు పల్లె పల్లె నుంచి పెద్ద సంఖ్యలో తరలి వెళ్తున్నారు. మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పిటిసిలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఉద్యమకారులు, యువకులు ప్రత్యేక వాహనాల్లో ఎవరికి వారు తరలి వెళ్తున్నారు. గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నూతన ఉత్సాహంతో ముందుకు సాగారు.
పల్లె పల్లెనా జెండా ఆవిష్కరణ
గులాబీ పార్టీ అధినేత కెసిఆర్ పిలుపు మేరకు ఉద్యమకారులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని గ్రామాల్లో జెండా ఆవిష్కరణ చేశారు. అంతకుముందు జెండా దిమ్మెలను నూతన రంగులు వేసి పూలమాలలతో ముస్తాబు చేశారు. పార్టీ శ్రేణులంతా చేరుకుని చేరుకుని బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం దశాబ్ద కాలం నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. జై కేసీఆర్, జై బీఆర్ఎస్, జై ఆల వెంకటేశ్వర్ రెడ్డి అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఎవరికి వారు వారు వాహనాలలో తరలి వెళ్లారు.