నాగర్ కర్నూల్ రూరల్, జూన్ 23: నాగర్ కర్నూల్ శాసనసభ్యులు డాక్టర్ కూచుకుల్ల రాజేష్ రెడ్డి (Rajesh Reddy) జన్మదినం కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, పార్టీ అభిమానుల సమక్షంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉదయం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం జరిపించారు. అనంతరం ఎమ్మెల్యే పిలుపు మేరకు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో క్యాంపు కార్యాలయ ఆవరణలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరంలో అభిమానులు, పార్టీ జిల్లా, మండలాల, గ్రామాల పార్టీ బాధ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఎమ్మెల్యే పుట్టిన రోజు వేడుకుల్లో పాల్గొనడం కోసం మండల పరిధిలోని వివిధ గ్రామాల నుండి పార్టీ కార్యకర్తలు డప్పు వాయిద్యాలతో వాహనాలలో తరలివచ్చి వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కూచుకుల్ల ఫౌండేషన్ తరుపున వికలాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్డు, ఆహారం అందించారు.
రక్తదానం చేస్తున్న అభిమానులు
అలాగే కొల్లాపూర్ క్రాస్ రోడ్డులో ఉన్న శ్రీ బాసర సరస్వతి దేవి ఆలయంలో, జ్ఞాన వాత్సల్య అనాధ బాలల ఆశ్రమంలో అన్నదాన వితరణ నిర్వహించారు. గ్రామాల నుంచి వచ్చిన ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ బాధ్యులు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు, అభిమానులు, వివిధ సంస్థల యూనియన్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.