Headingley Test : హెడింగ్లే టెస్టులో భారత క్రికెటర్లు సెంచరీల పండుగ చేసుకుంటున్నారు. ఇంగ్లండ్ బౌలర్లను సునాయసంగా ఎదుర్కొంటూ కేఎల్ రాహుల్ వంద కొట్టగా.. వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ (100 నాటౌట్) సైతం మూడంకెల స్కోర్ అందుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో సూపర్ సెంచరీ బాదిన పంత్.. రెండో ఇన్నింగ్స్‌లోనే శతకం బాదేశాడు. సుదీర్ఘ ఫార్మాట్లో ఈ ఫీట్ సాధించడం అతడికి ఇదే ప్రథమం. ఇంగ్లండ్‌పై ఒకే టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో వంద కొట్టిన భారతీయుడిగా పంత్ రికార్డు సృష్టించాడు. మొత్తంగా ఈ ఘనతకు చేరువైన ఏడో ఇండియన్ క్రికెటర్‌గా రికార్డుపుటల్లో నిలిచాడీ హిట్టర్.
భోజన విరామం తర్వాత గేర్ మార్చిన పంత్ పేసర్ జోష్ టంగ్ వేసిన తొలి ఓవర్లోనే వరుసగా రెండు ఫోర్లు బాదాడు. అనంతరం అతడి బౌలింగ్‌లోనే ఫోర్ కొట్టి.. డబుల్స్ తీసి ఫిఫ్టీ సాధించాడు. బషీర్‌కు చుక్కలు చూపిస్తూ లాంగాఫ్‌లో భారీ సిక్సర్ బాదాడీ చిచ్చరపిడుగు. రూట్ ఓవర్లో సింగిల్‌తో 99కు చేరిన ఈ డాషింగ్ బ్యాటర్.. బషీర్ బౌలింగ్‌లో సింగిల్ తీసి సెంచరీ సాధించాడు.
8⃣𝘁𝗵 𝗧𝗲𝘀𝘁 💯 𝗳𝗼𝗿 𝗥𝗶𝘀𝗵𝗮𝗯𝗵 𝗣𝗮𝗻𝘁! 🙌
1⃣st Indian to score hundreds in both innings of a Test in England 🔝
7⃣th Indian to score hundreds in both innings of a Test! 👏
Incredible batting display in the series opener from the #TeamIndia vice-captain! 👍 👍… pic.twitter.com/RzNA9lfFQr
— BCCI (@BCCI) June 23, 2025
పంత్ కంటే ముందు ఏడుగురు భారత ఆటగాళ్లు రెండు ఇన్నింగ్స్‌ల్లో వంద కొట్టారు. లెజెండ్ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) ఏకంగామూడు పర్యాయాలు ఈ ఫీట్ సాధించగా.. ‘వాల్’ రాహుల్ ద్రవిడ్ రెండుసార్లు ఈ మార్క్ అందుకున్నాడు. మిగతా ఐదుగురిలో మాజీలు విజయ్ హజారే, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, రోహిత్ శర్మ ఉన్నారు.