మహబూబ్నగర్ : బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉన్నాయి. వివిధ పార్టీల పెద్ద ఎత్తున నుంచి స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా నాగర్కర్నూల్ మున్సిపల్ పరిధిలోని బీజేవైఎం టౌన్ ప్రెసిడెంట్ చందు, పలువురు పార్టీ యువ కార్యకర్తలు బీజేపీ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరారు.
వారికి మాజీ శాసన సభ్యుడు మర్రి జనార్దన్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీలోనే కార్యకర్తలకు సరైన గుర్తింపు ఉంటుందన్నారు. అందరు కలిసి కట్టుగా బీఆర్ఎస్ గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.