Gurugram : సహజీవనం చేస్తున్న యువతిపై యువకుడు అత్యంత దారుణానికి పాల్పడ్డాడు. పాశవికంగా ఆమెపై దాడి చేశాడు. ప్రైవేట్ పార్ట్స్‌కు నిప్పు పెట్టాడు. ఈ ఘటన ఇటీవల హరియాణాలోని గురుగ్రామ్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. త్రిపురకు చెందిన యువతి (19) బయో టెక్నాలజీ డిగ్రీ చదివేందుకు గురుగ్రామ్ వచ్చింది. అక్కడ ఆమెకు ఢిల్లీకి చెందిన శివమ్ (19) అనే యువకుడు ఒక డేటింగ్ యాప్‌లో పరిచయమయ్యాడు. గత ఏడాది సెప్టెంబర్‌లో ఇద్దరి మధ్య పరిచయం అయింది.
కొద్ది రోజులకే ఇద్దరూ కలిసి సెక్టార్ 69లో ఒక రూమ్ తీసుకుని సహజీవనం చేస్తున్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఈ విషయంపై ఇరువురి కుటుంబాలకు కూడా చెప్పారు. అయితే, ఇటీవల శివమ్ ఆ యువతిని దారుణంగా వేధించడం మొదలుపెట్టాడు. అమ్మాయి పెళ్లి చేసుకోమని అడగడంతోపాటు ఇతర కారణాలతో శివమ్.. ఆ యువతిపై దారుణంగా దాడి చేశాడు. శానిటైజర్‌ను ఆమె ప్రైవేట్ పార్ట్స్‌పై పోసి నిప్పంటించాడు. బాటిల్‌తో తల పగలగొట్టాడు. అలాగే గోడకు తలను బాదడం, ఫర్నీచర్‌తో దాడి చేయడం వంటివి చేశాడు. కత్తితో కూడా దాడి చేశాడు. లైంగికంగానూ వేధించాడు. రూంలోంచి బయటకు రాకుండా చూశాడు. అయితే, ఏదోలాగా ఈ నెల 16న ఆమె తన తల్లికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పింది. దీంతో యువతి తల్లిదండ్రులు, లాయర్ కలిసి ఆమెను చేరుకున్నారు.
ఈ మూడు రోజుల్లో యువతిపై శివమ్ దారుణమైన దాడికి పాల్పడటంతో ఆమె తీవ్రంగా గాయపడింది. దీంతో మొదట ఆమెను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ నుంచి ఎయిమ్స్‌కు తరలించారు. అనంతరం ఆమెకు మరింత మెరుగైన చికిత్స అందించాలనే ఉద్దేశంతో ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దాడుల్లో ఆమె తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఆమెపై అత్యాచారం జరిగిందని వైద్యులు ధృవీకరించారు. అలాగే ప్రైవేట్ పార్ట్స్‌కు అయిన గాయలు, కత్తితో చేసిన గాయాల్ని కూడా గుర్తించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న యువతి పరిస్థితి విషమంగా ఉంది.
యువతి ల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితుడు శివమ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, అతడిపై బలమైన సెక్షన్ల మీద కేసు నమోదు చేయలేదని వారి తరఫు న్యాయవాది అన్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వైద్యుల నివేదికనుబట్టి నిందితుడిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.