టేకులపల్లి : ఊరంతా ఒకరోజు ఊరుబయట గడుపుతారట.. ఇదేంటి అనుకుంటున్నారా అది నిజమే.. ఆ ఊరికి ఏదో కీడు శంకిస్తుందని ఆ గ్రామస్తుల నమ్మకం. పూజారులకు ( priests) చూపిస్తే ఒకరోజు ఉదయం వేకువజామున ఊరంతా పిల్లాపాపలతో బయటకు వెళ్లి గడిపి సాయంత్రం సూర్యోదయం ముగిశాక ఇంటికి రావాలని సూచించారు.

ప్రపంచం శరవేగంగా ఆధునికత వైపు పయనిస్తున్న తరుణంలో ఇంకా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని బోడు ( Bodu ) గ్రామంలో ఈ సంఘటన జరిగింది. పూజారుల సూచనలను బోడు గ్రామస్థులంతా ఉమ్మడిగా నిర్ణయం తీసుకుని ఆదివారం పాటించారు. ఊరి జనమంతా ఇళ్లకు తాళాలు వేసి పిల్లపాపలు, పెద్దలు, యువత, వృద్ధులంతా కలసి గ్రామ శివారులో ఉన్న మామిడి తోటలో సేద తీరారు. గ్రామం ఖాళీ కావడంతో ఊరంతా నిర్మానుష్యంగా మారింది .