వెల్దండ జూన్ 17: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని బీజేపీ తెలంగాణ తరఫున స్వాగతిస్తున్నామని వెల్దండ బీజేపీ మండల నాయకుడు దుగ్గాపురం యాదయ్య అన్నారు. మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం 42 శాతం బీసీ రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేసారు.
అన్నిరకాల రిజర్వేషన్లు ముందుగానే ప్రకటించి పోటీ చేసే అభ్యర్థులకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎన్నికలకు రావడానికి వెనకంజ వేశారని ఎద్దేవ చేశారు. వెంటనే బీసీ రిజర్వేషన్లు ప్రకటించి, ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలన్నారు. గ్రామాల్లో పాలనలేక అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. ఈ సమావేశంలో పలువురు నాయకులు ఉన్నారు.