NZ vs RSA : అహ్మదాబాద్‌లో దక్షిణాఫ్రికా బౌలర్లు న్యూజిలాండ్‌ను అద్భుతంగా కట్టడి చేశారు. భీకర ఫామ్‌లో ఉన్న కివీస్ ఓపెనర్లను పడగొట్టిన మార్కో యాన్సెన్(4-40).. ప్రత్యర్థిని పవర్ ప్లేలోనే కష్టాల్లోకి నెట్టాడు. ఒత్తిడిలోనూ సాధికారిక ఇన్నింగ్స్‌తో చెలరేగిన మార్కో చాప్మన్(48) స్కోర్‌బోర్డును ఉరికించాడు. డారిల్ మిచెల్(32)తో 74 రన్స్ జోడించిన చాప్మన్.. ఆఖర్లో జేమ్స్ నీషమ్(23 నాటౌట్)ల మెరుపులతో బ్లాక్ క్యాప్స్ 175 పరుగుల చేసింది.
పొట్టి ప్రపంచకప్‌లో జోరుమీదున్న న్యూజిలాండ్ ఆదిలో తడబడినా.. ఆఖర్లో భారీ స్కోర్ చేసింది. అహ్మదాబాద్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు మార్కో యాన్సెన్(4-40) ధాటికి పవర్ ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోయింది. యూఏఈపై అర్ధశతకాలతో రెచ్చిపోయిన ఓపెనర్ టిమ్ సీఫర్ట్(13)ను డగౌట్ చేర్చిన యాన్సెస్ అతడు.. నాలుగో ఓవర్లో రచిన్ రవీంద్ర(13), ఫిన్ అలెన్(31)ను ఔట్ చేసి షాకిచ్చాడు. కేశవ్ మహరాజ్() ఓవర్లో గ్లెన్ ఫిలిప్స్ (1) క్లీన్‌బౌల్డయ్యాడు. 64కే నాలుగు కీలక వికెట్లు పడిన వేళ .. మార్క్ చాప్మన్(48), డారిల్ మిచెల్(32)లు బాధ్యతగా ఆడారు.
200 felt possible, but South Africa chip in with the wickets at crucial stages 🍿 pic.twitter.com/O5X92Ygp6A
— ESPNcricinfo (@ESPNcricinfo) February 14, 2026
ఒత్తిడిలోనూ బౌండరీలతో చెరలేగిన చాప్మన్.. అర్ధ శతకానికి చేరువయ్యాడు. ఈ జోడీని విడదీసేందుకు యాన్సెన్ చేతికి బంతి ఇచ్చిన మర్క్రమ్ ఫలితం సాధించాడు. కాసేపటికే మిచెల్సైతం వెనుదిరగడం, కెప్టెన్ మిచెల్ శాంట్నర్(4) విఫలమవ్వడంతో కివీస్ స్కోర్‌బోర్డు నెమ్మదించింది. ఆఖరి ఓవర్లో జేమ్స్ నీషం(23 నాటౌట్) చివరి రెండు బంతుల్ని ఫోర్లుగా మలచడంతో బ్లాక్ క్లాప్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 రన్స్ చేసింది.