NZ vs RSA : గత సీజన్ రన్నరప్ దక్షిణాఫ్రికా ఈసారి దుమ్మురేపుతోంది. తమ ఆటకు తిరుగులేదని చాటుతూ లీగ్ దశలో బలమైన న్యూజిలాండ్‌ను చిత్తు చేసి హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది. భారీ ఛేదనలో కెప్టెన్ ఎడెన్ మర్క్రమ్(86 నాటౌట్) అర్ధ శతకంతో కదం తొక్కగా.. కివీస్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. అంతకుముందు మార్కో యాన్సెస్(4-40) సంచలన స్పెల్‌తో రెండొందలకు పైగా కొట్టేలా కనిపించిన బ్లాక్ క్యాప్స్‌ను 175కే కట్టడి చేసింది ప్రొటీస్ జట్టు. వరుసగా మూడో విక్టరీతో సూపర్ -8కు చేరువైంది మర్క్రమ్ బృందం.
పొట్టి ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా జోరు కొనసాగుతోంది. తొలి రెండు మ్యాచుల్లో అలవోకగా గెలుపొందిన సఫారీ జట్టు ఈసారి ఫేవరెట్ న్యూజిలాండ్‌ను మట్టికరిపించింది. ప్రత్యర్ధి నిర్దేశించిన భారీ ఛేదనలో కెప్టెన్ ఎడెన్ మర్క్రమ్(86 నాటౌట్) తొలి ఓవర్ నుంచే దంచేశాడు. క్వింటన్ డికాక్(20) , రియాన్ రికెల్టన్(21)తో కలిసి కివీస్ బౌల్‌లను చెడుగుడు ఆడుకున్న మర్క్రమ్ అర్ధశతకంతో జట్టును విజయ తీరాలకు చేర్చాడు. పెర్గూసన్ వేసిన 18వ ఓవర్ మొదటి బంతినే డేవిడ్ మిల్లర్(24 నాటౌట్) సిక్సర్‌గా మలచగా 7 వికెట్ల తేడాతో ప్రొటిస్ టీమ్ జయభేరి మోగించింది.
Watch out everyone, South Africa mean business 🔥 😤 pic.twitter.com/EVv6SSd5aD
— ESPNcricinfo (@ESPNcricinfo) February 14, 2026
అహ్మదాబాద్‌లో దక్షిణాఫ్రికా బౌలర్లు న్యూజిలాండ్‌ను అద్భుతంగా కట్టడి చేశారు. భీకర ఫామ్‌లో ఉన్న కివీస్ ఓపెనర్లను పడగొట్టిన మార్కో యాన్సెన్(4-40).. ప్రత్యర్థిని పవర్ ప్లేలోనే కష్టాల్లోకి నెట్టాడు. ఒత్తిడిలోనూ సాధికారిక ఇన్నింగ్స్‌తో చెలరేగిన మార్కో చాప్మన్(48) స్కోర్‌బోర్డును ఉరికించాడు. డారిల్ మిచెల్(32)తో 74 రన్స్ జోడించిన చాప్మన్.. ఆఖర్లో జేమ్స్ నీషమ్(23 నాటౌట్)ల మెరుపులతో బ్లాక్ క్యాప్స్ 175 పరుగుల చేసింది.