Crime news | చిరుత పులి దాడిలో లేగ దూడ మృతి
నాగర్ కర్నూల్ : జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపుతున్నది. వెల్దండ మండలం నారాయణపూర్ గ్రామంలో గురువారం తెల్లవారుజామున లేగ దూడ పై ఓ చిరుత పులి దాడి చేసింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జక్కుల జంగయ్య అనే రైతు గ్రామ సమీపంలో ఉన్న తన వ్యవసాయ పొలంలో ఆవు దూడను కట్టేసి ఉంచారు.
గురువారం ఉదయం రైతు తన పొలం వద్దకు వెళ్లగా ఆవు దూడ పై గుర్తు తెలియని జంతువు దాడి చేసి చంపి తిన్నది. ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్ అంజి నాయక్‌కు తెలుపగా ఆయన ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఫారెస్ట్ అధికారి లలిత సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ జంతువు తిరిగిన చోటును పరిశీలించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో చిరుతను గుర్తించేందుకు చర్యలు చేపడతామని అన్నారు.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

