MUDA Chairman | మహబూబ్ నగర్ : మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆదేశానుసారం ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ మహబూబ్ నగర్ పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు ఎమ్మెల్యే ఆత్మీయ కానుకగా డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్‌ను ఉచితంగా అందజేశారు.
అనంతరం ముడా చైర్మన్ మాట్లాడుతూ.. పదవ తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు. మహబూబ్‌నగర్‌ను ఎడ్యుకేషనల్ హబ్‌గా అభివృద్ధి చేయుటకు ఎమ్మెల్యే ఎంతో కృషి చేస్తున్నారని గుర్తు చేశారు. తన సొంత నిధులతో ఉచితంగా డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్‌ను ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో చదివే పదవ తరగతి విద్యార్థులకు అందజేస్తున్నారని చెప్పారు.
పదవ తరగతి ఉన్నత చదువులకు ఫౌండేషన్ కోర్సు లాంటిదని, పదవ తరగతిలో అన్ని సబ్జెక్టులు మంచిగా చదివితేనే ఉన్నత చదువులకు ఎలాంటి ఇబ్బందులూ రావని లక్ష్మణ్ యాదవ్ విద్యార్థులకు చెప్పారు. పదవ తరగతిలో ఉన్న అన్ని సబ్జెక్టులను మళ్లీ ఒకసారి రివిజన్ చేసుకోవాలన్నారు. రానున్న పదవ తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులంతా మంచి ఫలితాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
KCR Birthday | ‘ప్రజల హృదయాల్లో నిలిచి.. మళ్లీ ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్’
Kothagudem | భార్యా పిల్లలను చూడ్డానికి అత్తగారింటికి వెళ్తే.. పెట్రోల్ పోసి నిప్పంటించారు..
KCR | కేసీఆర్ జోలికొస్తే నాలుక చీరేస్తాం రేవంత్ రెడ్డి : బీఆర్ఎస్ నాయకులు గోసుల శ్రీనివాస్ యాదవ్