SLBC Tunnel Mishap Review | మహబూబ్నగర్ : రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం నుండి, శ్రీశైలం ఎడమ కాలువ నిర్మాణ పనుల్లో జరిగిన ప్రమాద సంఘటనలో చిక్కుకున్న ఎనిమిది మందిని సురక్షితంగా తీసుకురావడానికి చర్యలను ముమ్మరం చేసింది. ఎంతటి ఉన్నతస్థాయి పరిజ్ఞాన్నైనా ఉపయోగించి సొరంగంలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకురావాలన్న రాష్ట్రముఖ్యమంత్రి ఆదేశానుసారం న్యూఢిల్లీలోని బోర్డర్స్ రోడ్స్ ఆర్గనైజేషన్, టన్నెల్ వర్క్స్ లో నిపుణులైన వారిని ప్రత్యేకంగా పిలిపించారు.
ఇవాళ సంఘటన స్థలానికి చేరుకున్న రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి, జడ్చర్ల శాసన సభ్యులు అనిరుధ్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ , టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషరఫ్ అలీతో సహాయ చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
టన్నెల్ లోపల జరుగుతున్న సహాయక చర్యలను మంత్రులు సమీక్షించారు. డీబీఎం వరకు చేరే మార్గాలను సహాయక బృందాలు పర్యవేక్షిస్తున్నట్లు మంత్రులకు అధికారులు వివరించారు. సహాయక చర్యలకు ఆటంకంగా వున్న బురద నీటిని తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఢిల్లీ నుంచి వచ్చిన ఆర్మీ అధికారులు కల్నల్ బ్లాక్ స్మిత్ మెహ్రా, లెఫ్టినెంట్ కల్నల్ హార్పల్, ఎన్డీఆర్ఎఫ్ డీఐజీ మోహ్సెన్ షహది, ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్ ప్రసన్న, నేవీ అధికారి వీకే ప్రసాద్, రాబిన్సన్ టన్నెల్ అధికారి గ్లెన్, ర్యాట్ మైనర్స్ బృందం ప్రతినిధి ఫిరోజ్ కురేషి ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.
SLBC Tunnel Mishap | చివరి దశకు రెస్క్యూ ఆపరేషన్.. సొరంగంలోకి ఉత్తరాఖండ్ టీం
Maha shivratri | శివరాత్రి స్పెషల్.. టాలీవుడ్ నుంచి కొత్త సినిమా పోస్టర్లు
Maha Kumbh | యాత్రికులతో కిటకిటలాడుతున్న ప్రయాగ్రాజ్.. 65 కోట్ల మంది పుణ్యస్నానాలు
బస్సులున్నయ్.. డ్రైవర్లే లేరు !.. డిప్యూటీ సీఎం ఇలాకాలో ఆర్టీసీ డ్రైవర్ల కొరత!