జోగులాంబ గద్వాల : జిల్లాలోని 44వ జాతీయ రహదారిపై పెను ప్రమాదం(Road accident) తప్పింది. వివరాల్లోకి వెళ్తే..హైదరాబాదులోని అత్తాపూర్‌కు చెందిన జావిద్ హుస్సేన్ నూరు ఇరాహి, మహమ్మద్ గౌస్ తోపాటు మరో ఇద్దరు చిన్నారులతో కలిసి కారులో ఏపీలోని కర్నూలుకు బయలుదేరారు. మార్గమధ్యలో జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల పరిధిలోని అంతర్ రాష్ట్ర చెక్‌పోస్ట్ దగ్గర జాతీయ రహదారి పై నిలిచి ఉన్న డీసీఎంను కారు ఢీకొంది.
ఈ సంఘటనలో కారు బెలూన్స్ ఓపెన్ కావడంతో పెను ప్రమాదం తప్పింది. కారు డ్రైవర్ అమీర్ తో పాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడ్డ వారిని హైవే అంబులెన్స్‌లో కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం వీరందరూ క్షేమంగా ఉన్నట్టు సమాచారం. కర్నూలు పట్టణంలోని బంధువుల ఇంటికి వెళుతుండగా సంఘటన జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.