గద్వాల జిల్లా: జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలోని ఆరగిద్ద జ్ఞాన సరస్వతి ప్రైవేట్ స్కూల్ వ్యాన్ ఒక్కసారిగా అదుపుతప్పి పొలంలో దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో దాదాపు 20 మంది విద్యార్థులు స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యంతో ఘటన చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Bigg Boss 9 | ఇమ్మాన్యుయేల్‌కి ఏంటి అంత కోపమొచ్చింది.. సంజనకి బిగ్ బాస్ ప్రత్యేక పవర్
ఎల్ఐసీకి కష్టకాలం.. 70 శాతం వరకు కోల్పోయిన పెట్టుబడులు