Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నాలుగో ఎపిసోడ్ గురువారం ఆసక్తికర పరిణామాలతో సాగింది. కెప్టెన్సీ టాస్క్ ప్రారంభమై హౌస్మేట్స్ మధ్య ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఎపిసోడ్ మొదట్లో సంజన రూల్స్ బ్రేక్ చేసిన విషయంపై చర్చ సాగింది. అదే సమయంలో బిగ్ బాస్ సంజనను కన్ఫెషన్ రూమ్‌కి పిలిచి, ఆమె నిజాయతీ, ధైర్యాన్ని అభినందించారు. హౌస్‌లో అందరూ తనను కార్నర్ చేస్తున్నారని సంజన తెలిపింది. దీనిపై బిగ్ బాస్ ఆమెకు ధైర్యం చెప్పి, కుటుంబం బాగానే ఉందని, గేమ్‌పై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రత్యేకంగా, ఐదుగురిని కెప్టెన్సీ పోటీదారులుగా ఎంచుకునే పవర్ సంజనకి ఇచ్చారు.
సంజన తనతో పాటు శ్రేష్ఠి వర్మ, హరీష్, పవన్, ఇమ్మాన్యుయేల్ ను ఎంపిక చేసింది. ఈ నిర్ణయంపై ఇతర సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేయగా, సంజన తన కారణాలను వివరించింది. బిగ్ బాస్ నియమాల ప్రకారం పోటీదారులు ఒక్కొక్కరికి సపోర్టర్లను ఎంచుకున్నారు. ఇమ్మాన్యుయేల్‌కి – భరణి, శ్రేష్ఠి వర్మకి – రాము రాథోడ్, సంజనకి – శ్రీజ దమ్ము, పవన్‌కి – ప్రియా. ఇక
టాస్క్ ప్రకారం సపోర్టర్లు గోడకు అమర్చిన రాడ్లపై కాళ్లు కింద పెట్టకుండా నిలబడాలి. ఎక్కువసేపు నిలబడిన టీమ్ గెలిచేలా నియమం పెట్టారు. మనీష్ టాస్క్ సంచాలకుడిగా వ్యవహరించాడు.
టాస్క్ సమయంలో రెడ్ లైట్ వెలిగినప్పుడు ఇమ్మాన్యుయేల్‌ని పిలిచారు. ఆయన రాడ్ తొలగించేలోపు గ్రీన్ లైట్ వెలుగడంతో, నియమం ప్రకారం ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్ అయ్యాడు. ఎలిమినేషన్‌పై ఇమ్మాన్యుయేల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. గ్రీన్ లైట్ విషయాన్ని ముందుగానే చెప్పాల్సింది సంచాలకుడని, ఇందులో తన తప్పేమీ లేదని వాదించాడు. ఇది పెద్ద గొడవగా మారి, ఇమ్మాన్యుయేల్ మనీష్‌పై కేకలు వేస్తూ విరుచుకుపడ్డాడు. మనీష్ కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. కామెడీతో ఎప్పుడూ అలరించే ఇమ్మాన్యుయేల్‌లోని ఆగ్రహం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది. గురువారం ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్క్ సగం వరకు సాగి ముగిసింది. తొలి కెప్టెన్ ఎవరు అనేది తదుపరి ఎపిసోడ్లో తేలనుంది. రాను రాను బిగ్ బాస్ హౌజ్ రణరంగంగా మారుతుంది.