Farmers | ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వం MSP చట్టం, రుణ విముక్తితోపాటు రైతులకు ఇచ్చిన హామీలు అన్నిటినీ అమలు చేయాలి. నూతన జాతీయ మార్కెటింగ్ ముసాయిదాను రద్దు చేయాలని తెలంగాణ రైతాంగ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి గోపాల్ డిమాండ్ చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) జాతీయ కమిటీ పిలుపులో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం శాంతినగర్ అంబేద్కర్ చౌరస్తా కేంద్రంలో ఆయన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జి గోపాల్ మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలన్నారు. నూతన జాతీయ మార్కెటింగ్ విధానాన్ని రద్దు చేయాలని, మూడు వ్యవసాయ చట్టాలను మళ్లీ అమల్లోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతుందని తెలియజేశారు.
విద్యుత్ సవరణ బిల్లుని రైతు సంఘాలతో చర్చించకుండా పార్లమెంటులో ప్రవేశపెట్టనని రాతపూర్వకంగా హామీ ఇచ్చి వాటిని తుంగలో తొక్కింది. కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి నిధులలో కోత విధించిందని, ఎరువుల సబ్సిడీలో తగ్గింపు చేసిందని ధరల స్థిరీకరణ నిధి పెంచలేదని, ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన రైతాంగానికి ఉపయోగపడే విధంగా చర్యలు చేపట్టలేదని అన్నారు.
మార్కెట్ విధానాన్ని అమలు చేయమని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయాలని, పార్లమెంటులో దీన్ని వ్యతిరేకించాలని మాట్లాడారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.గట్టు ఎత్తిపోతల పథకానికి నిధులు కేటాయించి పనులు పూర్తి చేయాలి. జూరాల ప్రాజెక్టు లో పూడిక తీసివేయాలి. ఆర్డీఎస్ 15 . 9 టీఎంసీలు వాటా చివరి ఆయకట్టువరకు నీళ్లు పారించాలన్నారు.
ఈ ధర్నా కార్యక్రమాల్లో సామాజిక కార్యకర్త గోపాల్ రెడ్డి, తెలంగాణ జన సమితి అల్లంపూర్ తాలూకా ఇన్ఛార్జి వై రామ్మోహన్, లింగేశ్వర్ రెడ్డి, రామకృష్ణ, తిక్కన్న, మద్దిలేటి గోపాల్, పక్కిరన్న సుదర్శన్, హలీ బాబు తదితర రైతులు తదితర రైతులు పాల్గొన్నారు.
Rashmi Gautam| రాజమండ్రిలోని గోదావరిలో అస్థికలు కలిపి ఫుల్ ఎమోషనల్ అయిన రష్మీ గౌతమ్
Nama Ravikiran | ఎల్ఆర్ఎస్పై మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం : బీఆర్ఎస్ నేత నామ రవికిరణ్
Nizampeta Farmer | రెండు బోర్లు వేసిన.. బొట్టు నీళ్లు పల్లేదంటూ నిజాంపేట యువ రైతు ఆవేదన