Collector BM Santhosh| జోగులాంబ గద్వాల జిల్లాలోని మానవపాడు మండలం కలుకుంట్ల గ్రామం రైతు వేదిక వద్ద బుధవారం మధ్యాహ్నం ఉండవల్లి మండలం బొంకూరు గ్రామానికి చెందిన రైతు జమ్మన్న వృద్ధాప్య, రక్తపోటు కారణంగా అకస్మాత్తుగా గుండెపోటుతో మృతిచెందితే.. దీనిపై పలు వదంతులను వ్యాపింపచేయడం తగదని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ ఒక ప్రకటనలో తెలియజేశారు.
కొన్ని మీడియాల్లో రైతు మృతిపై వచ్చిన వార్తలపై కలెక్టర్ స్పందిస్తూ.. జమ్మన్న పండించిన 23 క్వింటాళ్లతోపాటు ఆయన బంధువు రఘు 120 క్వింటాళ్ల మొక్కజొన్నను తీసుకొని ఈ నెల 20న మానవపాడు మండలం కలుకుంట్ల గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి అతని బంధువు రఘు తీసుకువచ్చారన్నారు.
మొక్కజొన్న తేమ శాతం ఎక్కువగా ఉండడంతో కేంద్రం సమీపంలోనే ఎండబెట్టడం జరిగిందన్నారు. మొక్కజొన్న తేమ 14 శాతం ఉన్నప్పుడు ఈ నెల 23న కేంద్రం ఇంచార్జ్ కొనుగోలు చేశారన్నారు. కొనుగోలు తర్వాత మొక్కజొన్న ధర చెల్లింపు కోసం బయోమెట్రిక్‌లో వేలి ముద్ర వివరాలు ఇవ్వాలని కేంద్రం నిర్వాహకులు రఘుకు తెలియజేశారన్నారు. దీంతో రఘు ఈ నెల 24న బొంకూరు గ్రామం నుంచి జమ్మన్నను వెంటబెట్టుకొని కలుకుంట్ల గ్రామానికి మధ్యాహ్నం చేరుకున్నారన్నారు.
కొనుగోలు కేంద్రం వద్ద జమ్మన్న ఒక గంట సేపు మాత్రమే ఉండడం జరిగిందని, కానీ మీడియాలో జమ్మన్న నాలుగు రోజులుగా కొనుగోలు కేంద్రం వద్ద వేచి ఉండాల్సి వచ్చిందనే వార్తల్లో వాస్తవం లేదన్నారు. బుధవారం బొంకూరు నుంచి కలుకుంట్ల రైతు వేదిక వద్దకు రాగానే జమ్మన్నకు అకస్మాత్తుగా ఫిట్స్ వచ్చి గుండెపోటు రావడంతో మృతి చెందడం జరిగిందన్నారు. వెంటనే మృతుడి బంధువులు అంబులెన్స్‌ను పిలిపించి జమ్మన్న మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించారన్నారు.
జమ్మన్నకు రక్తపోటు ఉండడంతో కొంతకాలంగా చికిత్స తీసుకుంటూ మందులు వాడుతున్నట్లు తెలిసిందని కలెక్టర్ తెలిపారు. జమ్మన్న మృతిపై పలు మీడియాలో వచ్చిన సమాచారం సరైనది కాదని పేర్కొన్నారు.
Jagadish Reddy | రేవంత్‌రెడ్డి కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోడు : జగదీశ్‌రెడ్డి
Bus overturns | మహబూబ్‌నగర్ జిల్లాలో స్కూల్ బస్సు బోల్తా.. పలువురు విద్యార్థులకు గాయాలు : వీడియో
Hrithik Roshan | పెళ్లి వేడుకలో కుమారులతో కలిసి స్టెప్పులేసిన హృతిక్ రోషన్… వీడియో వైరల్