గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లాలోని గోన్పాడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గోన్పాడు వద్ద తండ్రీ కొడుకులు వెళ్తున్న బైక్ను ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదేండ్ల బాలుడు అక్కడికక్కడే మరణించాడు. తండ్రికి తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది.