Runa Mafi | వెల్దండ, మార్చి 5 : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులు ఏ మాత్రం సంతోషంగా లేరని బీఆర్ఎస్ మండల యువ నాయకుడు పోలే అశోక్ అన్నారు. ఇవాళ వెల్దండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
రైతులకు ఎకరానికి రూ.15000 ఇస్తామని చెప్పి.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతుబంధు ఇవ్వకుండా మోసం చేస్తుందని ఆరోపించారు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ పేర్లు చెప్పి రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయలేదని ఆరోపించారు. 6 గ్యారంటీల పేరుతో అధికారులకు వచ్చిన కాంగ్రెస్ ప్రజలను పూర్తిగా మోసగించిందని ఆరోపించారు.
గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పదేళ్లు రైతులు ఎంతో సుఖ సంతోషాలతో ఉన్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో రైతులు విస్తుపోయారని అన్నారు. భూగర్భ జలాలు అడుగంటి పోయి రైతులు సాగు నీటి కోసం ఎదురు చూస్తున్నారని.. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నెలకొందన్నారు. ఈ సమావేశంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
Singer Kalpana | వెంటిలేటర్‌పై చికిత్స.. కల్పన హెల్త్ బులెటిన్ విడుదల
Crazy Star Award | రెబ్బెనకు చెందిన దేవర వినోద్‌కు క్రేజీ స్టార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు
Inter student | పోలీసుల ఔదార్యం.. ఇంటర్ విద్యార్థిని సకాలంలో పరీక్ష కేంద్రానికి తరలింపు