Muslims | ఊట్కూర్, మార్చి 25: ఉమ్మడి రాష్ట్ర పాలనలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ముస్లిం మైనారిటీల జీవితాల్లో రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్ వెలుగులు నింపారు. అనేక దశాబ్ధాలుగా వివక్షతకు గురైన మైనారిటీల అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ పెద్దపీట వేసి ఆదరించారు.
ఈ క్రమంలోనే ముస్లింలు రంజాన్ పండుగను సుఖ సంతోషాలతో జరుపుకునేందుకు దుస్తుల పంపిణీ, ప్రతి కుటుంబానికి రంజాన్ తోఫా కిట్ల పంపిణీ, మసీదుల మరమ్మతులకు ప్రతి ఏటా నిధుల మంజూరు, ఇమామ్, మౌజాన్లకు ప్రతి నెల పారితోషికం అందించి అక్కున చేర్చుకున్నారు. ఇదే క్రమంలో రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రంజాన్ తోఫా కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేసింది.
పేద ముస్లింలు రంజాన్ సుఖ సంతోషాలకు దూరం కాకూడదనే ఉద్దేశంతో కొందరు దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మైనారిటీలకు దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. తాజాగా ఇవాళ నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో చిన్నపొర్ల గ్రామానికి చెందిన డాక్టర్ మక్బుల్ అహ్మద్ పెద్ద సంఖ్యలో పేద ముస్లింలకు చీరల పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు పాషా, అన్వర్ బాగు, అఫ్జల్ అహ్మద్, అస్మత్, మహబూబ్, అబ్దుల్ రజాక్, మహమ్మద్ ఇలియాస్, అబ్దుల్ హక్ తదితరులు పాల్గొన్నారు.
Eknath Shinde | కమ్రా సుపారి తీసుకున్నట్లుంది.. కమెడియన్ వ్యాఖ్యలపై స్పందించిన ఏక్నాథ్ షిండే
Encounter | ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్కౌంటర్.. భద్రతాదళాల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి
Bangladesh | మహమ్మద్ యూనస్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు..? త్వరలో బంగ్లాలో సైనిక పాలన..?