Students | మరికల్ మండలంలోని గాజులయ్య తాండ ప్రాథమిక పాఠశాలకు వేసవితాపాన్ని దృష్టిలో ఉంచుకొని కర్ని గ్రామ మాజీ ఎంపీటీసీ రాధా దత్తురామ్ కూలర్‌ను అందజేశారు. ఇవాళ పాఠశాల ఆవరణలో ఎంపీఓ పావని చేతుల మీదుగా కూలర్‌ను పాఠశాల హెచ్ఎం లక్ష్మయ్యకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో ఉక్కపోతను తట్టుకునేందుకు విద్యార్థులకు తన వంతు సహకారంగా వీ గార్డ్ కంపెనీకి సంబంధించిన కూలర్‌ను ఇవ్వడం జరిగిందని తెలిపారు. కూలర్ వితరణ చేసిన రాధా దత్తురామ్నుపాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మయ్యతోపాటు ఉపాధ్యాయుడు నవీన్ కుమార్ గౌడ్, ఎంపీఓ పావనిలు సన్మానించారు. అలాగే ఇవాళ పాఠశాలలో విద్యార్థులు స్వయం స్వపరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించుకున్నారు.
ముఖ్యమంత్రిగా ప్రేమ్, కలెక్టర్‌గా సరస్వతి, డిప్యూటీ కలెక్టర్‌గా అరవింద్, డీఈవోగా జగన్, ఎంఈఓగా కురుమూర్తి, పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా సక్కుబాయి, అజయ్ లతోపాటు 9 మంది విద్యార్థులు ఉపాధ్యాయులకు వ్యవహరించి తోటి విద్యార్థులకు విద్యాబోధన చేశారు. ఉత్తమంగా విద్యాబోధన చేసిన విద్యార్థులకు పాఠశాల ఉపాధ్యాయులు లక్ష్మయ్య, నవీన్ కుమార్ గౌడ్ లు బహుమతులను అందజేశారు. స్వయం సపరిపాలన దినోత్సవం ఎంపీ ఓ పావని సందర్శించి విద్యార్థులను అభినందించారు.
Read Also :
KTR | ఎట్లుండె తెలంగాణ.. ఎట్లాయె తెలంగాణ..! కేటీఆర్ ఆవేదన
Bomb Attack | పాఠశాలపై బాంబులతో దాడి.. షాకింగ్ వీడియో
Chhaava Movie | నాలుగు రోజుల్లో రూ.10 కోట్లు.. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ‘ఛావా’ విధ్వంసం