Harish Rao | రైతులకు రూ.29,300 కోట్ల రైతు బంధు బాకీ పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం : హరీశ్ రావు
Harish Rao | రేవంత్ రెడ్డి ఇవాళ హైదరాబాద్‌లో రైతుల ఆశీర్వాద సభ మీటింగ్ పెట్టిండు. నా దృష్టిలో రైతులను అడుగడుగున వంచించినవ్ కదా.. అది రైతు ఆశీర్వాద సభ కాదు.. రైతు వంచన సభ అని పెట్టుకో అని రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు హితవు పలికారు.
Harish Rao | జడ్చర్ల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ఇవాళ హైదరాబాద్‌లో రైతుల ఆశీర్వాద సభ మీటింగ్ పెట్టిండు. నా దృష్టిలో రైతులను అడుగడుగున వంచించినవ్ కదా.. అది రైతు ఆశీర్వాద సభ కాదు.. రైతు వంచన సభ అని పెట్టుకో అని రేవంత్ రెడ్డికి హితవు పలికారు.
ఎన్నికల ముందు ఎకరానికి రూ.15 వేలు రైతు బంధు ఇస్తామని హామీనిచ్చిర్రు.. కానీ ఇచ్చిందెంత రూ.12 వేలు.. అవి కూడా ఒక పంట మొత్తానికే 9వేలు ఎగ్గొట్టిండు. ఒక పంట 3 ఎకరాలే ఇచ్చాడు. ఇంకో పంట 2 ఎకరాల వరకే ఇచ్చాడు.. వాళ్లిచ్చిన ప్రకారం లెక్క తీస్తే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధుపై రూ.29300 కోట్లు రైతు బంధు పేరిట రైతులకు బాకీ పడిందన్నారు హరీశ్ రావు .
జడ్చర్ల సభ నుంచి అడుగుతున్నా రేవంత్ రెడ్డి నువ్వు పెట్టుకున్న ఈ రైతు వంచన సభలో రూ.29300 కోట్లు ఎప్పటిలోపు ఇస్తావో తెలంగాణ రైతాంగానికి చెప్పాలని డిమాండ్ చేస్తున్నానన్నారు హరీశ్ రావు. ఈ బాకీ బడ్డ రైతు బంధు డబ్బులు ఎన్ని రోజుల్లోగా తిరిగిస్తావో చెప్పలని తెలంగాణ రైతుల పక్షాన, బీఆర్ఎస్ పార్టీ పక్షాన నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నానన్నారు.
రైతు ఆశీర్వాద సభ కాదు.. రైతు వంచన సభ
ఎన్నికల ముందు ఎకరానికి రూ.15 వేలు అని చెప్పి ఇచ్చింది రూ.12 వేలు.. అందులో ఒక పంట మొత్తం ఎగ్గొట్టాడు
ఇంకోసారి 2 ఎకరాల వరకే ఇచ్చాడు.. ఇంకోసారి 3 ఎకరాల వరకే ఇచ్చాడు
కాంగ్రెస్ ప్రభుత్వం రూ.29300 కోట్లు రైతు బంధు పేరిట రైతులకు బాకీ పడింది
— Telugu Scribe (@TeluguScribe) June 30, 2026
Read Also :
Guo Wengui: చైనా బిలియనీర్‌కు 30 ఏళ్ల జైలుశిక్ష విధించిన అమెరికా కోర్టు
AP News | రైల్వేస్టేషన్లో పాములు.. ప్రయాణికులు బెంబేలు..!
Jairam Ramesh: సర్, ఈసీ పాత్రను ప్రశ్నిస్తూ సీజేఐకి లేఖ రాసిన 23 విపక్ష పార్టీలు
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

