Jairam Ramesh: సర్, ఈసీ పాత్రను ప్రశ్నిస్తూ సీజేఐకి లేఖ రాసిన 23 విపక్ష పార్టీలు
Jairam Ramesh: 23 విపక్ష పార్టీలు ఇవాళ భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్‌కు లేఖ రాశాయి. వివిధ రాష్ట్రాల్లో చేపడుతున్న సర్ ప్రక్రియతో పాటు ఎన్నికల సంఘం పాత్ర, ఎన్నికలకు సంబంధించిన సమస్యల గురించి ఆ పార్టీలు ప్రశ్నించాయి. న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవాలని ఆ లేఖలో విపక్ష పార్టీలు కోరాయి.
న్యూఢిల్లీ: వివిధ రాష్ట్రాల్లో చేపడుతున్న సర్ ప్రక్రియతో పాటు ఎన్నికల సంఘం పాత్ర, ఎన్నికలకు సంబంధించిన సమస్యల గురించి ఇవాళ 23 విపక్ష పార్టీలు భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్‌కు లేఖ రాశాయి. 23 పార్టీలతో పాటు ఓ ఇండిపెండెంట్ ఎంపీ సంతకం చేసిన లేఖను జస్టిస్ సూర్యకాంత్‌కు పంపినట్లు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్(Jairam Ramesh) తెలిపారు. ఇండియా బ్లాక్ పార్టీలతో పాటు ఆమ్ ఆద్మీ, డీఎంకే పార్టీలు కూడా ఆ లేఖలో సంతకాలు చేశాయి. తన ఎక్స్ అకౌంట్లో జయరాం రమేశ్ ఈ విషయాన్ని తెలిపారు. సంఘీభావం, ఐక్యత, ప్రతిఘటనతో విపక్ష పార్టీలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.
జూన్ 8వ తేదీన జరిగిన ఇండియా కూటమి నేతల సమావేశంలో సీజేఐకి లేఖ రాయాలని నిర్ణయించినట్లు రమేశ్ తెలిపారు. మల్లిఖార్జున్ ఖర్గే, రాహుల్ గాందీ, మమతా బెనర్జీ , తేజస్వీ యాదవ్, అఖిలేశ్ యాదవ్, హేమంత్ సోరెన్, ఒమర్ అబ్దుల్లా, కపిల్ సిబల్, డెరిక్ ఒబ్రెయిన్ ఆ లేఖలో సంతకం చేశారు. కేంద్రంలోని అన్ని వ్యవస్థలు విఫలమైనప్పుడు, భారత ప్రజాస్వామ్యం.. న్యాయవ్యవస్థను ఆశ్రయిస్తుందన్న అభిప్రాయాన్ని విపక్ష నేతలు వ్యక్తం చేశారు.
న్యాయ శాఖ అంతరాత్మను కోరుతున్నామని, దేశంలో ఏం జరుగుతుందో జుడీషియరీ పట్టించుకోవాలని విపక్ష నేతలు కోరారు. భారత ఎన్నికల సంఘం పాత్ర, సర్ వల్ల వివిధ రాష్ట్రాల్లో ఓటర్లు ప్రభావానికి గురైన విషయాన్ని లేఖలో పేర్కొన్నట్లు చెప్పారు. కేంద్ర సర్కారు చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ విధానాన్ని కాంగ్రెస్ పార్టీతో పాటు విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
21 political parties plus one Independent attended the INDIA janbandhan meeting on June 8, 2026 where a decision was taken to address a joint letter to the Hon’ble Chief Justice of India on the SIR process of the Election Commission of India and other election-related issues.…
— Jairam Ramesh (@Jairam_Ramesh) June 30, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Toxic | యష్ ‘టాక్సిక్’కు మరో షాక్.. రూ.200 కోట్ల ఓటీటీ డీల్‌పై నీలినీడలు!
Hanuma Reddy | రిలీజ్ ముందే బంపరాఫర్.. యష్‌తో డేవిడ్ రెడ్డి దర్శకుడు కొత్త సినిమా?
Supriya Sule | సుప్రియా సూలే అల్లుడికి చెందిన సంస్థకు.. 1,200 ఎకరాల భూమిని లీజుకిచ్చిన మహారాష్ట్ర ప్రభుత్వం
పురాతన ఆలయ గోపురం ధ్వంసం.. సుదర్శన చక్రం చోరీకి యత్నం?
‘గీత కార్మికులకు ఇచ్చిన హామీలను తక్షణం నెరవేర్చాలి’
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

