Collector Adarsh Surabhi | ఇటీవల కురిసిన అకాల వర్షం, వడగండ్ల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకునే విధంగా ప్రభుత్వానికి నివేదిస్తామని జిల్లా కలెక్టర్ ఆదర్ష్ సురభి తెలిపారు. ఇవాళ కొత్తకోట మండల పరిధిలోని సంకిరెడ్డి పల్లి గ్రామంలో అకాల వర్షం కారణంగా నష్టపోయిన వరి పంటలను కలెక్టర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవిందు నాయక్‌తో కలిసి పరిశీలించారు. వెంకట్ రాములు అనే రైతు వరి పొలాన్ని సందర్శించి రైతుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
సంకిరెడ్డి పల్లిలో మొత్తం ఎన్ని ఎకరాల్లో పంట డ్యామేజ్ అయిందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని ఆరా తీయగా, వ్యవసాయ శాఖ సర్వే చేసిన ప్రకారం 170 ఎకరాల్లో పంట డ్యామేజ్ అయిందని తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో వడగండ్లు, అకాల వర్షం కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకునే విధంగా ప్రభుత్వానికి పూర్తి వివరాలు నివేదిస్తామని తెలిపారు.
ఇందిరమ్మ ఇల్లు మోడల్ హౌస్ సందర్శన..
కొత్తకోట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇల్లు మోడల్ హౌస్ ను కలెక్టర్ సందర్శించారు. వేగంగా పూర్తి చేయాలని హౌసింగ్ అధికారులకు ఆదేశించారు. అదేవిధంగా మోడల్ హౌస్ నిర్మాణం ప్రారంభం కాని మండలాల్లో వెంటనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు నాయక్, హౌసింగ్ పీడీ పర్వతలు, డి ఈ విటోభా, ఉద్యాన శాఖ అధికారి అక్బర్, తహసిల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.
Eknath Shinde | కమ్రా సుపారి తీసుకున్నట్లుంది.. కమెడియన్ వ్యాఖ్యలపై స్పందించిన ఏక్నాథ్ షిండే
Encounter | ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్కౌంటర్.. భద్రతాదళాల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి
Bangladesh | మహమ్మద్ యూనస్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు..? త్వరలో బంగ్లాలో సైనిక పాలన..?