MLA Madhusudan reddy | భూత్పూర్, జూన్ 24 : ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణ కేంద్రంలోని చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారని తెలిపారు. తొమ్మిది రోజుల్లో రైతు భరోసా పథకం ద్వారా రైతులకు 9000 కోట్లను పంపిణీ చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిదేననన్నారు. రైతులు ఆనందంగా ఉన్నప్పుడే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ కుమార్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేశిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు లిక్కి నవీన్ గౌడ్, మాజీ ఎంపీపీ కదిరె శేఖర్ రెడ్డి, మండల నాయకులు నరసింహారెడ్డి, హర్యానాయక్, బోరింగ్ నర్సిములు, రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Garidepalli : ఎన్ఎఫ్బీఎస్ లబ్ధిదారులకు ఆర్థిక సాయం : తాసీల్దార్ కవిత
Weather Report | నాలుగు రోజులు వానలే.. హెచ్చరించిన వాతావరణశాఖ
Ram Mohan Naidu | బ్లాక్‌బాక్స్ భారత్‌లోనే ఉంది : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు