SLBC Tunnel Mishap | అచ్చంపేట, మార్చి 6 : శ్రీశైలం ఎడమ గట్టు ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రమాదం జరిగి 13 రోజులు కావస్తున్నా లోపల చిక్కుకున్న 8 మంది కార్మికుల ఆచూకీ కనిపించలేదు. అధికార యంత్రాంగం, రెస్క్యూ బృందాలు శ్రమిస్తున్నా ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. టన్నెల్ లోపల చిక్కుకున్న వారిని గుర్తించేందుకు కేరళ నుంచి ప్రత్యేకంగా క్యాడవర్ డాగ్స్‌లను రప్పిస్తున్నట్లు డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ తెలిపారు.
ఇవాళ ఉదయం టన్నెల్ వద్ద జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్‌తో కలిసి ఐఐటీ నిపుణులు, సింగరేణి సాంకేతిక నిపుణులు, సైనిక అధికారులు, ఎన్డీఆర్ఎఫ్, అధికారులతో సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఇవాళ ఉదయం ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి, ఐఐటీ నిపుణులతోపాటు సైనిక అధికారులు టన్నెల్ లోపలికి వెళ్ళారు. ఒక చివర నుంచి మట్టిని తీసి ఎస్కలెటర్‌పై వేస్తూ నీటిని మరో వైపు దారి మళ్ళీస్తూ ముందుకు సాగాలని సూచించారు.
సింగరేణి సిబ్బందితోపాటు యాంత్రిక సహకారం తీసుకుంటూ మనుషులు బురదను బయటికి తరలించేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మధ్యాహ్నం వరకు టన్నెల్‌కు డాగ్స్ చేరుకుంటాయని తెలిపారు. టన్నెల్ లోపల పనిచేసేవారికి కావలసిన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, ఎన్.డి.ఆర్.ఎఫ్. అధికారులు, సింగరేణి అధికారులు, ఐ. ఐ టి నిపుణులు తదితరులు పాల్గొన్నారు.
S Jaishankar | అధిక సుంకాలతో భారత్ – అమెరికా వాణిజ్య సంబంధాలపై అనిశ్చితి.. జై శంకర్ ఏమన్నారంటే..?
Bandlaguda Jagir | చెత్త బండ్లగూడ.. మున్సిపాలిటీలో పారిశుద్ధ్యంపై పట్టింపేది?
Janhvi Kapoor| రామ్ చరణ్ కొత్త సినిమా నుండి జాన్వీ లుక్ రిలీజ్.. ఒక్కసారిగా పెరిగిన అంచనాలు