Prediabetes symptoms | మీలో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే షుగర్ పరీక్షలు చేయంచుకోండి
Prediabetes symptoms | చాలా మంది తమకు డయాబెటిస్ ఉందన్న విషయాన్ని త్వరగా గుర్తించలేకపోతున్నారు. దాంతో వ్యాధి ముదిరి ముప్పు పెరిగిపోతున్నది. అందుకే డయాబెటిస్‌ను ముందే గుర్తించడం చాలా మంచిది. కాబట్టి మధుమేహం వచ్చినప్పుడు మనలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా మధుమేహం (Diabetes), అధిక రక్తపోటు (High blood pressur) వంటి దీర్ఘకాలిక వ్యాధులు వేగంగా విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా మధుమేహం అత్యంత వేగంగా వ్యాపిస్తున్నది. మన దేశంలోనూ డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకే పెరుగుతున్నది. అయితే కొత్తగా ఆ వ్యాధి బారిన పడుతున్న వారిలో చాలా మంది తమకు డయాబెటిస్ ఉందన్న విషయాన్ని త్వరగా గుర్తించలేకపోతున్నారు. దాంతో వ్యాధి ముదిరి ముప్పు పెరిగిపోతున్నది. అందుకే డయాబెటిస్‌ను ముందే గుర్తించడం చాలా మంచిది. కాబట్టి మధుమేహం వచ్చినప్పుడు మనలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆ లక్షణాలు ఏంటో తెలుసుకుందామా..?
ఈ లక్షణాలు మధుమేహానికి సంకేతాలు..
- డయాబెటిస్ వచ్చే ముందు మనలో కనిపించే లక్షణాలను ప్రీడయాబెటిస్ సింప్టమ్స్ (Prediabetes symptoms) అంటారు. ఈ ప్రీడయాబెటిస్ సింప్టమ్స్ రకరకాలుగా ఉంటాయి. కొందరిలో అన్ని రకాల లక్షణాలు కనిపిస్తే, మరికొందరిలో కొన్ని రకాల లక్షణాలు మాత్రమే కనిపిస్తాయి.
1. మధుమేహం వచ్చే ముందు కొందరిలో జట్టు రాలుతుంది. అయితే జుట్టు రాలిందంటే కచ్చితంగా మధుమేహం ఉన్నట్లు కాదు. సంబంధిత పరీక్షలు చేయించుకుంటే ఈ విషయంలో కచ్చితత్వం వస్తుంది.
2. డయాబెటిస్ బారిన పడిన కొత్తలో కొందరిలో అలసట పెరుగుతుంది. రోజంతా అలసటగా ఉంటుంది. పని చేసినా, ఏ పని చేయకపోయినా అలసటగా అనిపిస్తుంది.
3. మరి కొందరికి మధుమేహం సోకితే చర్మంపై మచ్చలు వస్తుంటాయి. ఇలా చర్మంపై మచ్చలు కనిపిస్తే షుగర్ సంబంధ వైద్య పరీక్షలు చేయించుకోవడం ఉత్తమంగా ఉంటుంది.
4. ఇంకా కొంత మందిలో మధుమేహం బారిన పడినప్పుడు తరచూ మూత్రం వస్తుంది. మూత్రానికి వెళ్లినా కొద్ది దాహం వేస్తుంది. నీళ్లు తాగినా కొద్ది యూరిన్‌కు వెళ్లాల్సి వస్తుంది.
5. కొంత మందిలో పై లక్షణాలతోపాటే అదనంగా తరచూ తలనొప్పి వస్తుంది. చేతులు, కాళ్లు తిమ్మిర్లు పడుతాయి.
- కాబట్టి పై లక్షణాల్లో ఏది కనిపించినా వెంటనే షుగర్ పరీక్షలు చేయించుకోవడం ఉత్తమమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి..
Feet health | పాదాల్లో పగుళ్లు వేధిస్తున్నాయా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే
Ectopic Pregnancy | ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఎందుకొస్తుంది? ఇది అంత ప్రమాదమా?
Health Tips | వంటింటి ఔషధం వెల్లుల్లితో ఆరోగ్యానికి మేలు
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

