Ectopic Pregnancy | ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఎందుకొస్తుంది? ఇది అంత ప్రమాదమా?
Ectopic Pregnancy | గర్భధారణ అనే ప్రక్రియ.. అండంతో శుక్రకణం కలిశాక, అది పిండంగా ఏర్పడ్డ సమయం నుంచి మొదలవుతుంది. అండంతో శుక్రకణం కలవడాన్ని ‘ఫలదీకరణ’ అంటారు. ఫలదీకరణ జరిగాక ఏర్పడ్డ పిండం గర్భసంచిలో పెరగాలి. కానీ, కొన్ని సందర్భాల్లో గర్భసంచిలో కాకుండా.. దాని పరిసరాల్లో పిండం పెరగడాన్ని ‘ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ’ అంటారు.
లక్షణాలు :
ఎప్పుడు అనుమానించాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి అంటే?
☞ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీగా అనుమానించడానికి తోడ్పడే కొన్ని లక్షణాలు ఇలా వ్యక్తమవుతాయి.
☞ తొలిదశల్లో యోని నుంచి రక్తస్రావం కావడం, పొత్తికడుపులో నొప్పి రావడం ద్వారా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీగా అనుమానించాలి.
☞ తల తేలికైపోయిన ఫీలింగ్‌తోపాటు స్పృహ తప్పవచ్చు.
☞ భుజం నొప్పి కూడా కనిపించవచ్చు.
☞ ఈ లక్షణాలు కనిపిస్తే తక్షణం డాక్టర్‌ను కలవాలి.
ఎవరెవరిలో ముప్పు ఉంటుందంటే?
☞ మొదట ఒకసారి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చి ఉన్నవాళ్లలో మరోసారి కూడా వచ్చే అవకాశముంది.
☞ జీవిత భాగస్వామి నుంచి గనేరియా, క్లమీడియా వంటి కొన్ని లైంగిక సంబంధిత ఇన్ఫెక్షన్లు సోకిన మహిళల్లో ఈ ముప్పు కనిపించవచ్చు.
☞ సంతాన సాఫల్యత కోసం చికిత్సలు తీసుకుంటున్నవారిలో.
☞ ఫెలోపియన్ ట్యూబుల్లో లోపాలుండి, వాటిని సరిదిద్దేందుకు శస్త్రచికిత్స తీసుకున్నవారిలో.
☞ పొగతాగే అలవాటు ఉన్న మహిళల్లో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీకి అవకాశాలు ఎక్కువ.
ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్లు
నివారణ
☞ పొగతాగే అలవాటుకు పూర్తిగా దూరంగా ఉండటం. ఇది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ నివారణకే కాదు.. అనేక ఇతర అనారోగ్యాలనూ నివారిస్తుంది.
☞ లైంగిక సంబంధాల వల్ల సంక్రమించే వ్యాధులను నిర్ధారించడం
☞ ముందస్తుగా చేసే నిర్ధారణ మరియు చికిత్స ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో చాలా ముఖ్యం.
Read More :
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma Celebrations | దుబాయ్‌లో GTF ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు.. ఫొటోలు
Congress | కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నది : సబితా ఇంద్రా రెడ్డి
ICC Player of the Month: శుభమన్ గిల్‌కు అయిదోసారి.. షఫాలీ వర్మకు రెండోసారి
Jobs | ఇండియన్ ఆర్మీలో 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 57.. జేఈఈ మెయిన్ స్కోర్‌తో ప్రవేశాలు
Rajamouli | అమెరికాలో రాజమౌళి.. ‘వారణాసి’ షూటింగ్‌కు విరామం, కుటుంబ వేడుకలో సందడి!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

