Pregnancy Doubts | ప్రెగ్నెన్సీ సమయంలో భర్తతో కలయికలో పాల్గొంటే ఏమవుతుంది?
Pregnancy Doubts | ప్రెగ్నెన్సీ సమయంలో మహిళల్లో ఎన్నో సందేహాలు ఉంటాయి. ఎలాంటి పనులు చేయాలి? ఏం తినాలి? ఎలా నడుచుకోవాలి? ఇలా ఎన్నెన్నో అనుమానాలు మదిలో మెదులుతుంటాయి. మరెన్నో భయాలు వెంబడిస్తుంటాయి.
Pregnancy Doubts | ప్రెగ్నెన్సీ సమయంలో మహిళల్లో ఎన్నో సందేహాలు ఉంటాయి. ఎలాంటి పనులు చేయాలి? ఏం తినాలి? ఎలా నడుచుకోవాలి? ఇలా ఎన్నెన్నో అనుమానాలు మదిలో మెదులుతుంటాయి. మరెన్నో భయాలు వెంబడిస్తుంటాయి. అలాంటి వాటిల్లో ఒకటి ప్రెగ్నెన్సీ సమయంలో శృంగారం చేయడం మంచిదేనా? ఆ సమయంలో భర్తతో కలయిక విషయంలో చాలా అనుమానాలు ఉంటాయి. కడుపులో బిడ్డపై ప్రభావం పడుతుందని.. అబార్షన్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయనే అపోహలు ఉంటాయి. మరి అవన్నీ వాస్తవాలేనా? వట్టి అపోహలేనా? ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రెగ్నెన్సీ సమయంలో భర్తతో కలయికలో పాల్గొంటే అది కడుపులోని బిడ్డపై ప్రభావం చూపిస్తుందని చాలామంది అనుకుంటుంటారు. అబార్షన్, ప్రీ మెచ్యూర్ డెలివరీ అవుతుందేమోనని కూడా భయపడిపోతుంటారు అందుకే గర్భధారణ సమయంలో శృంగారంలో పాల్గొనేందుకు చాలామంది ఇష్టపడరు. కానీ అలాంటి దుష్ప్రభవాలు ఏమీ ఉండవని నిపుణులు చెబుతున్నారు. హై రిస్క్ జోన్లో ఉన్న గర్బిణులు తప్ప మిగిలిన వాళ్లు డాక్టర్ సలహా మేరకు నిరభ్యంతరంగా కలయికలో పాల్గొనవచ్చని నిపుణులు చెబుతున్నారు. కాకపోతే కలయిక సమయంలో గర్భిణీ సౌకర్యాలను చూసుకోవడం చాలా అవసరమని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పొట్ట మీద భారం పడకుండా ఉండే భంగిమలను ఎంచుకోవడం మంచిదని సూచిస్తున్నారు. కలయిక తర్వాత వెజైనా దగ్గర నొప్పి, అసౌకర్యం వంటి ఇబ్బందులు ఉండొచ్చని.. అయితే ఇవి సహజంగా ఉండేవే కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. నిండు గర్భిణీగా ఉన్న సమయంలో శృంగారంలో పాల్గొనాలని అనుకుంటే మాత్రం డాక్టర్ వద్ద చెకప్ చేయించుకుని.. ఏ ఇబ్బంది లేదంటేనే ముందడుగు వేయాలని హెచ్చరిస్తున్నారు.
వీళ్లు దూరంగా ఉండటమే బెటర్
ప్రెగ్నెన్సీ సమయంలో కలయికలో పాల్గొనడం అందరికీ మంచిది కాదు. హై రిస్క్ జోన్లో ఉన్న మహిళలు శృంగారానికి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. వీళ్లతో పాటు వెజైనా సమస్యలు ఉన్నవాళ్లు, గర్భసంచి వదులుగా ఉండి కుట్లు వేయించుకున్న వాళ్లు, కడుపులో కవలలు ఉన్నా కూడా కలయికలో పాల్గొనవద్దు. గతంలో ప్రీమెచ్యూర్ డెలివరీ అయినవాళ్లు కూడా శృంగారానికి దూరంగా ఉండాలి. అలాగే భాగస్వామి ఏదైనా ఇన్ఫెక్షన్, లైంగికంగా సంక్రమించే వ్యాధులతో బాధపడుతుంటే వాళ్లు కూడా కలయికకు దూరంగా ఉండటమే బెటర్.
ఇవీ బెనిఫిట్స్..
ప్రెగ్నెన్సీ పీరియడ్‌లో శృంగారంలో పాల్గొనడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. అలాగే ఫిట్‌గా ఉండాలంటే కూడా కలయికలో పాల్గొనమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో తరచూ శృంగారంలో పాల్గొనడం వల్ల సంతోషానికి కారణమయ్యే ఎండార్పిన్లు అధికంగా విడుదలవుతాయి. తద్వారా గర్భిణీ, కడుపులో ఉన్న బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారు. అలాగే జననేంద్రియాలకు రక్త సరఫరా సక్రమంగా జరిగి కండరాలు బలంగా తయారవుతాయి. తద్వారా ఆయా భాగాల్లోని చిన్న చిన్న సమస్యలు తగ్గిపోతాయి. వీటన్నిటితో పాటు భార్యాభర్తల మధ్య గ్యాప్ రాకుండా ఉంటుంది.
Read More :
“గర్బిణీగా ఉన్నప్పుడు మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?”
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

